తుల్జాభవాని ఆలయ నిర్మాణానికి 50 బస్తాల సిమెంట్ కు నగదు బహుకరణ.. BRS రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యా నాయక్
తుల్జాభవాని ఆలయ నిర్మాణానికి 50 బస్తాల సిమెంట్ కు నగదు బహుకరణ.. BRS రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యా నాయక్
చింతపల్లి ………
చింతపల్లి మండల పరిధిలోని పాలెం తండా లో నిర్మించ తలపెట్టిన శ్రీ తుల్జా భవాని ఆలయ నిర్మాణం కోసం బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్ 50 బస్తాల సిమెంట్ కొరకు డబ్బులు ఇవ్వడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ అమ్మ వారి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కొరుక్కుంటున్నాను అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జ్యోతి చందర్ నాయక్, జైపాల్ నాయక్,ఉప సర్పంచ్ కుమార్ నాయక్, నరేష్ నాయక్,, వార్డు సభ్యులు బాస్కర్ నాయక్,సుమన్,మనోహర్ , రాకేష్ తదితరులు పాల్గొన్నారు.