మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటే ప్రశాంతమైన ఆలోచనలే వస్తాయి..యోగాచార్యులు షేక్ బహార్ అలీ .

నేడు ఖమ్మం,పాండురంగాపురం ZPHS పాఠశాలలో ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు యోగ, ప్రాణాయామం, ధ్యానం శిక్షణ తరగతులు యోగాచార్యులు షేక్ బహార్ అలీ నిర్వహించిన్నారు… కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు మరియు PT, ప్రసాద్, ఇతర ఉపాధ్యాయ, ఉపాధ్యాయనీలు పాల్గొన్నారు..
విద్యార్థులను ఉద్దేశించి యోగా గురువు షేక్ బహిర్ అలీ మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పుడూ కూడా యోగ పట్ల మంచి ఆసక్తి కలిగి ఉండాలని అన్నారు…. మంచి భావనతో కృషితో చేసే ప్రతి పని కూడా విజయవంతం కావాలంటే మంచి పోటీ తత్వం కలిగిన అలవాట్లు చేసుకోవాలని అన్నారు.. మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటే ప్రశాంతమైన ఆలోచనలే వస్తాయని అన్నారు… గురువులు ,తల్లిదండ్రుల పట్ల విద్యార్థులు మంచి భావన కలిగి ఉండాలని అన్నారు… ఆరోగ్యంగా ఉంటే చదువు కూడా దానంతట అదే వస్తుందని మంచి అలవాట్ల వల్ల మంచి ఆరోగ్యం కూడా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు.