33 జిల్లాల సర్పంచుల ఫోరం రాష్ట్ర స్థాయి సమావేశం..!

33 జిల్లాల సర్పంచుల ఫోరం రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న గర్దాస్ విక్రమ్.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో 33 జిల్లాల జిల్లా అధ్యక్షుల రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది..

*ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు వి. శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు*.

*ఈ కీలక సమావేశంలో రాష్ట్ర సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి, ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ కూడా పాల్గొని తన అభిప్రాయాలను వెల్లడించారు*.

*ఈ సందర్భంగా సర్పంచుల ఎదుర్కొంటున్న సమస్యలు, గ్రామ పంచాయతీలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ నిధులు, సర్పంచులకు గౌరవ వేతనం, బీమా సౌకర్యం, అధికారాల కల్పన వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది*.

సమావేశంలో గర్దాస్ విక్రమ్ మాట్లాడుతూ ” మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర అధ్యక్షులు యాదయ్య గౌడ్ నాయకత్వంలో సర్పంచులందరం ఐక్యంగా ఉన్నాం. గ్రామాల అభివృద్ధే మా లక్ష్యం. పార్టీలకు అతీతంగా ప్రతిగ్రామాని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం అన్నారు..