యుద్ధాన్ని ఎక్కువకాలం కొనసాగించే స్థితిలో ఇరాన్ లేదు.. మా దగ్గర ఇంకా అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి : ట్రంప్.

యుద్ధాన్ని ఎక్కువకాలం కొనసాగించే స్థితిలో ఇరాన్ లేదు: ట్రంప్.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ఇరాన్ ఎక్కువకాలం కొనసాగించలేదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అమెరికా వద్ద మందుగుండు సామగ్రి కొరత ఏర్పడిందన్న వార్తలు నిజం లేదు.. తమ వద్ద కీలక ఆయుధాల భారీ నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు…
అయితే మరోవైపు, అమెరికా సైన్యం కొన్ని ఖచ్చితమైన దీర్ఘశ్రేణి క్షిపణుల నిల్వలను గణనీయంగా వినియోగించినట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో రక్షణ ఉత్పత్తిని మరింత పెంచేందుకు కొత్త ఆయుధ తయారీ సౌకర్యాల ఏర్పాటుపై అమెరికా దృష్టి సారించింది.
ఇక ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ మాట్లాడుతూ, అమెరికా తమ దేశంపై గరిష్ఠ ఆర్థిక ఒత్తిడిని ప్రయోగిస్తోందని ఆరోపించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో ఇరాన్ ఇంధన రంగం తీవ్రంగా దెబ్బతింటోందని తెలిపారు.
ఇరాన్ ఆర్థిక పరిస్థితి, యుద్ధాన్ని కొనసాగించే సామర్థ్యంపై అమెరికా వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. అయితే ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పటికీ, ఇరాన్ వద్ద ఇప్పటికీ గణనీయమైన క్షిపణి సామర్థ్యం ఉందని ఆ దేశ రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..