నేటి వార్తా బులెటిన్ …

తేదీ: 22 అక్టోబర్ 2026

రోజు: గురువారం

వార్తా బులెటిన్

అంతర్జాతీయ వార్తలు

🔹 ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) హెచ్చరిక: గత అంచనాల కంటే భూతాపం మరింత పెరిగే ప్రమాదం ఉంది.

🔹 1848లో సౌర తుఫాను కారణంగా ఒక రైలు ఆలస్యమైన సంఘటన వెనుక ఉన్న చారిత్రక రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించారు.

జాతీయ వార్తలు

🔹 భారత రక్షణ మంత్రిత్వ శాఖ, గగనతల రక్షణను మరింత బలోపేతం చేయడానికి రాడార్ల కొనుగోలు నిమిత్తం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)తో ₹770 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది.

🔹 2029 డిసెంబర్ 31 నాటికి భారతదేశాన్ని మాదకద్రవ్యాల రహిత దేశంగా మార్చేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడేళ్ల లక్ష్యాన్ని ప్రకటించారు..
*🔹డిల్లీ: ఇవాళ సాయంత్రం ఇండియా కూటమి కీలక సమావేశం.*

_• వర్చువల్‌గా ఇండియా కూటమి నేతలతో మాట్లాడనున్న ఖర్గే._

*• నవంబర్ 1న SIR, CEC జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా భారీ సభ.*

_• సభ నిర్వహణపై చర్చించనున్న ఇండియా కూటమి నేతలు.

నేటి నుంచి వారణాసిలో వింగ్స్ ఓవర్ ది గంగా ఎయిర్ షో.

వైమానిక దళం 94వ వార్షికోత్సవం సందర్భంగా ఎయిర్ షో.

4 రోజుల పాటు కొనసాగనున్న వైమానిక ప్రదర్శన
ఈనెల 25న కార్యక్రమంలో పాల్గొననున్న మోదీ, రాజ్‌నాథ్.

ఆంధ్రప్రదేశ్ వార్తలు

🔹 రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నిలిపివేసింది.

🔹 రాయలసీమలో వరి ధాన్యం కొరత కారణంగా బియ్యం ధరలు రెట్టింపై కిలోకు ₹100కు చేరాయి.

🔹 దసరా సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు నేడు తిరిగి ప్రారంభమవుతున్నాయి.

MPTC, ZPTC ఎన్నికలకు తొలి రోజు భారీగా నామినేషన్లు.

MPTC-5,267, ZPTC-409 నామినేషన్లు దాఖలు.

MPTC స్థానాల్లో TDP-2,719, YCP-1,918 నామినేషన్లు.

జనసేన-294, బీజేపీ-74, స్వతంత్రులు-172 నామినేషన్లు.

ZPTC స్థానాల్లో టీడీపీ-128, వైసీపీ-192 నామినేషన్లు.

జనసేన-21, BJP-24, కాంగ్రెస్-17 నామినేషన్లు దాఖలు.

ఏపీలో మొత్తం MPTC స్థానాలు 9,829,ZPTC స్థానాలు 659…

కర్నూలు: దేవరగట్టు బన్ని ఉత్సవంలో హింస
కర్రల సమరంలో 100 మందికిపైగా గాయాలు
ఐదుగురి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు
మాలమల్లేశ్వరస్వామి ఉత్సవ ఊరేగింపులో చెలరేగిన హింస, కర్రలు, దివిటీలు తిప్పే క్రమంలో పగిలిన తలలు..

ఉత్తర అండమాన్‌లో ఉపరితల ఆవర్తనం..

కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన.. వచ్చే వారం వర్షాలు.

25 నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక.

నేడు మూడు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు వర్ష సూచన..

Telangana వార్తలు..

క్రీడా వార్తలు

🔹 ఆసియా పారా క్రీడల మూడో రోజు భారత్ 5 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 27 పతకాలను సాధించింది.

🔹 క్రికెట్‌లో, న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా భారత్ తొలి టీ20 మ్యాచ్‌ను నేడు క్రైస్ట్‌చర్చ్‌లో ఆడనుంది.