BC-D నుంచి BC-Aకు ముదిరాజ్‌లు.. CM కీలక వ్యాఖ్యలు.

TG: జనగణనలో కులగణన చేసి ఎవరూ చేయని సాహసం చేశామని CM రేవంత్ అన్నారు. ఇప్పుడు ఆ లెక్కలే BCలకు బలాన్ని ఇచ్చాయని చెప్పారు.
‘BCల లెక్కలు పక్కాగా ఉన్నాయి. అవసరమైతే వాటిని సవరిస్తాం. ముదిరాజ్‌లను BC-D నుంచి BC-Aకు మార్చాలని కోరుతున్నారు. ఈ అంశంపై వచ్చే క్యాబినెట్‌లో చర్చిస్తాం. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి అధ్యయనం చేయిస్తాం’ అని రవీంద్ర భారతిలో పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలలో అన్నారు.
—తొలిసారిగా బీసీల జనాభా లెక్కలను తేల్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న లెక్కల్లో ఎవరైనా తమ వివరాలు నమోదు కాలేదని భావిస్తే, వాటిని సవరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అవసరమైతే బీసీ కులగణన లెక్కలను సరిచేసి, జాబితాలోకి రాని వారిని చేర్చుతామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. ఏ కులం వారికైనా తమ జనాభా లెక్కల్లో తక్కువగా నమోదైందని భావిస్తే, సంబంధిత వివరాలు అందించాలని సూచించారు. వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి లెక్కలను మరింత పక్కాగా చేయిస్తామని తెలిపారు. నాకు అవకాశం ఉంటే నా కుర్చీ చుట్టూ బలహీనవర్గాలను కూర్చోబెట్టుకోవాలన్నది నా ఆలోచన అన్నారు..

ముదిరాజ్‌లను బీసీ-డీ (BC-D) నుంచి బీసీ-ఏ (BC-A) జాబితాలోకి మార్చే అంశంపై వచ్చే క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన ‘శ్రీ పండుగ సాయన్న ముదిరాజ్’ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కీలక ప్రకటనలు చేశారు…..తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ముదిరాజ్‌ల జనాభానే అత్యధికమని, గతంలో వారు తనకు చేసిన సాయాన్ని ఎప్పటికీ మరుచనని సీఎం తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక ముదిరాజ్ బిడ్డలకు అనేక అవకాశాలు కల్పించామని, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే మంత్రి వాకిటి శ్రీహరికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించానని గుర్తుచేశారు. ముదిరాజ్‌లను బీసీ ‘డి’ నుంచి బీసీ ‘ఏ’లోకి మార్చాలని కోరుతున్న డిమాండ్‌పై స్పందిస్తూ.. బీసీ సామాజిక వర్గాలకు పూర్తి న్యాయం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. దేశంలోనే ఎవరూ చేయని విధంగా ఏడాదిలోనే కులగణన పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలిచామని, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ కులాల వర్గీకరణను కూడా చేపట్టి సంచలనం సృష్టించామన్నారు.