*సూర్యాపేట జిల్లా…*
హుజూర్ నగర్ పట్టణంలో భారీ చోరీ..
ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ 20 తులాల బంగారం, కేజీ వెండి అపహరణ..
యజమానులు ఊరికి వెళ్లిన సమయంలో దొంగల చేతివాటం..
హుజుర్ నగర్ లో శ్రీనివాస థియేటర్ వెనుక బజారులో ఘటన విచారణ చేపట్టిన పోలీసులు..
పట్టణంలో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. శ్రీనివాస థియేటర్ వెనుక బజారులోని ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడినట్లు సమాచారం.
ఇంటి యజమానులు ఊరికి వెళ్లిన విషయాన్ని గమనించిన దొంగలు.. ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో సుమారు 20 తులాల బంగారం, కేజీ వెండి అపహరణకు గురైనట్లు ఇంటి యజమానులు ఆరోపిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. చోరీ జరిగిన తీరుపై వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
హుజూర్నగర్ పట్టణంలో జరిగిన ఈ చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ..
రెండు రోజుల వ్యవధిలో పట్టణంలో వరుస దొంగతనాలు, ఓ హత్య పట్టణంలో ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురిచేస్తుంది..