ఆళ్లగడ్డ,ఆత్మకూరు మున్సిపాలిటీ టీడీపీ కైవసం.

నంద్యాల: ఆళ్లగడ్డ మున్సిపాలిటీ టీడీపీ కైవసం.

మున్సిపల్‌ చైర్మన్‌గా TDP అభ్యర్థి అనీషా ఏకగ్రీవం.

22 వార్డుల్లో టీడీపీ, 8 వార్డుల్లో వైసీపీ ఏకగ్రీవం.

2 వార్డుల్లో జనసేన అభ్యర్థులు ఏకగ్రీవం..

ఆత్మకూరు మున్సిపాలిటీ టీడీపీ కైవసం.

మున్సిపల్‌ చైర్మన్‌గా గోవిందరాజులు (TDP) ఏకగ్రీవం. ..

నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ స్థానిక పోరులో ఘన విజయం సాధించిన అనంతరం, ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మొత్తం 32 వార్డులూ ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. అందులో టీడీపీ 22 వార్డులను సొంతం చేసుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 8 వార్డులు, జనసేన పార్టీ 2 వార్డులలో విజయం సాధించింది. ఈ క్రమంలోనే మొత్తం 32 స్థానాలు ఏకగ్రీవం కావడం, మెజారిటీ స్థానాలను టీడీపీ గెలుచుకోవడంతో పాలకవర్గ ఏర్పాటు సుగమమైంది. అనంతరం నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో షేక్ అనీషాను చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.