ఏపీకి భారీ వర్ష సూచన.
ఉభయగోదావరి జిల్లాలతో పాటు కాకినాడ..
కోనసీమ, ఏలూరు, అల్లూరి జిల్లాలకు వర్ష సూచన.
అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.
నవంబర్ 1, 2న అతి భారీ వర్షాలు కురిసే చాన్స్
గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం…
నవంబర్ 2 వరకు మత్స్యకారులు వేలకు వెళ్లొద్దని సూచన.
విశాఖ, మచిలీపట్నం, కృష్ణపట్నంతో పాటు..
ప్రధాన ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక..
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవులను మరోసారి పొడిగించారు. నేడు కూడా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తుఫాన్ కారణంగా మంగళవారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు కొనసాగుతుండగా.. పరిస్థితులు ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి రాకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి సెలవు పొడిగింపుపై ప్రకటన చేశారు…
అర్నబ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో విద్యార్థుల క్షేమాన్ని కాపాడటమే ప్రథమ ప్రాధాన్యతగా అధికారులు సరైన నిర్ణయమే తీసుకున్నారు. పాఠశాలల ఆవరణల్లో చెట్లు పడిపోవడం, విద్యుత్ లేకపోవడంతో తాగునీటి సరఫరా నిలిచిపోవడం వంటివి పిల్లల భద్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తాయి. ఈ పరిస్థితుల్లో పాఠశాలలను పునఃప్రారంభించకపోవడమే మంచిది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు…