రాహుల్ గాంధీ మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు సోయి లేదా.. పబ్లిక్ హియరింగ్ అని చెప్పి.. పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్…కేటీఆర్..
తెల్లారి లేస్తే రాజ్యాంగాన్ని పట్టుకొని పోజులు కొట్టే రాహుల్ గాంధీ మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు సోయి లేదా.. పబ్లిక్ హియరింగ్ అని చెప్పి.. పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్ అవుతుందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కరువులో రాష్ట్రం ఉంటే సుందరీకరణ పేరుతో డ్రామాలు మీరే చెప్తున్నారు.. కరువు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఊళ్లల్లో నాటకాలు వేయాలంట.. జానపదాలు పాడాలంట.. పద్యాలు పాడాలట.. డ్రామాలు చేయాలట. ఇక్కడ మాత్రం మూసీలో లక్షన్నర కోట్ల లూటీకి ముఖ్యమంత్రి తెరలేపారని అన్నారు…