మియాపూర్‌ భూములు కొల్లగొట్టేందుకు కేసీఆర్, ఆయన బంధువులు అనేక రకాలుగా ప్రయత్నాలు ..సీఎం రేవంత్ రెడ్డి…..

మియాపూర్ భూముల తీర్పుపై మీడియాతో సీఎం రేవంత్ మాట్లాడుతూ..మియాపూర్ భూముల వ్యవహారంపై శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ క్రమంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపాడిన భూముల చిట్టా అంతా బయటపెట్టారు. ఈ భూములను కొల్ల గొట్టేందుకు కేసీఆర్, ఆయన బంధువులు అనేక రకాలుగా ప్రయత్నించారని తెలిపారు. ఈ భూములను ఆక్రమించుకునేందుకు కొందరు రకరకాలుగా తప్పుడు దారి మళ్లిస్తున్నారు అన్నారు…మియాపూర్ లోని 550 ఎకరాల భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపిాంచి రూ. 50 వేల కోట్ల ఆస్తిని కాపాడుకో గలిగామన్నారు…ముఖ్యంగా గోల్డ్ స్టోన్ సంస్థ చేయని ప్రయత్నాలు లేవన్నారు. ఈ భూముల విషయంలోనే దామోదరరావుకు గోల్డ్ స్టోన్ సంస్థ ప్రసాదరావు ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చారన్నారు. కొందరు అధికారులను అడ్డం పెట్టుకుని భూములను కొట్టేయాలని చూశారని దుయ్యబట్టారు. ఈ భూముల విషయంలో కొందరు అధికారులు అరెస్టయిన విషయాన్ని ఈ సందర్భంగా వివరించారు.

న్యాయస్థానం నుంచి తీర్పు రాగానే ఆయా భూములను స్వాధీనం చేసుకోవాలని అధికారలను ఆదేశించినట్టు తెలిపారు. అవసరమైతే ఈ భూములను వేలం వేసి దళిత, బహుజనుల కోసం ఖర్చు చేస్తామని తేల్చేశారు. మంచిరేవులలో 143 ఎకరాలను కాపాడామని తెలియజేశారు. ఎల్బీనగర్ లో 150 ఎకరాల భూములను అటవీ ప్రాంతంగా మార్చామన్నారు. మొత్తానికి లక్షా 50 వేల కోట్ల విలువైన భూములను కబ్జాల నుంచి కాపాడామన్నారు… ఈ కేసుకు సంబంధించి గురువారం ( అక్టోబర్ 29 ) విచారణ జరిపిన సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఈ భూములపై ప్రైవేటు వ్యక్తుల హక్కుల వాదనలను తిరస్కరించింది సుప్రీంకోర్టు.ఈ క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన అప్పీళ్లన్నీ కొట్టేసింది కోర్టు.దీంతో మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101లో భూములపై దశాబ్దాల వివాదానికి ఫుల్ స్టాప్ పడ్డట్లయింది. మ్యాప్‌లుచూడండి

550 ఎకరాలకు పైగా భూములపై వివిధ వర్గాల యాజమాన్య హక్కుల వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. 1949లో జాగీర్ వ్యవస్థ రద్దు తర్వాత భూములపై హక్కుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. జాగీర్ హక్కులు ఉన్నంత మాత్రాన భూమిపై యాజమాన్య హక్కులు సంక్రమించవని స్పష్టం చేసింది.మియాపూర్ భూముల వివాదంలో ప్రభుత్వ భూములను ఆక్రమించే ప్రయత్నాలు జరిగాయని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. ఏథిక్స్కోర్సులు

1912 నుంచి ఉన్న ప్రభుత్వ రికార్డులకు ప్రాధాన్యత ఇస్తూ.. పహాణీ రికార్డుల్లో పేర్లు ఉన్నంత మాత్రాన భూమిపై యాజమాన్య హక్కులు రావని స్పష్టం చేసింది కోర్టు. భూములపై హక్కులను నిరూపించడంలో అప్పీలుదారులు విఫలమయ్యారని తెలిపింది.

భూములు ప్రభుత్వానికి చెందుతాయన్న హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. భూముల వివాదంలో పరిహారం లేదా ఇతర సమానత్వపరమైన ఉపశమనాలకు కూడా నిరాకరించింది సుప్రీంకోర్టు. కోర్టుసమాచారం అందించింది అని తెలిపారు..