రాప్తాడు బాధిత బాలికకు మెరుగైన వైద్యం… గ్రీన్ ఛానెల్ ద్వారా బెంగళూరుకు తరలింపు..
🔹 రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో రంపంతో దాడికి గురై తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థిని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రి నుంచి బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు.
🔹 సీఎం చంద్రబాబు ఆదేశాలతో బాలిక తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి వేగంగా బెంగళూరుకు చేర్చే చర్యలు చేపట్టారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ బాధిత బాలికను పరామర్శించారు.
🔹 మరోవైపు ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు హేమంత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాఠశాల హెచ్ఎంను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
తరగతి గదిలో టీచర్ పాఠాలు చెపుతున్నప్పుడు హటాత్తుగా ఆ దుండగుడు లోనికి ప్రవేశించి, నేరుగా ఓ బాలిక వద్దకు వెళ్ళి తన రంపం మెషిన్ ఆన్ చేసి మొదట ఆమె గొంతు కోయబోయాడు.
ఆమె భయంతో కేకలు వేస్తూ చెయ్యి అడ్డుపెట్టగా రంపం మెషిన్‌తో ఆ చేతిని కోసి పడేశాడు. ఆమెతో సహా తరగతి గదిలో ఉన్న విద్యార్దినులు భయంతో కేకలు పెడుతుండగానే, అతను దాంతో ఆ బాలికపై విచక్షణారహితంగా దాడి చేసి తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగిపోయింది.
స్కూల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన అంబులెన్సుతో అక్కడకు చేరుకొని చెయ్యి తెగి తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్ధినిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అనంతపురం జిల్లాలోని రాప్తాడు హైస్కూల్లో విద్యార్థినులపై దాడి చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. క్లాస్ రూమ్‌లోకి చొరబడి బాలికపై చెట్లను కట్ చేసే మెషిన్‌తో విచక్షణారహితంగా దాడి చేసిన ఉన్మాదిని హేమంత్గా పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో అతడిని ధర్మవరం రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణమైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే రియాక్ట్ అయ్యారు. ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని తల్లితో సీఎం ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని, చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు అన్ని విధాలా కృష్టి చేస్తామని భరోసా ఇచ్చారు.
గాయపడిన మరో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవల వివరాలపై స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీతతో ఆయన స్వయంగా మాట్లాడారు. బాలికలపై దాడికి పాల్పడిన నిందితుడిని చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు….
పోలీసులు వెంటనే అతని కోసం గాలింపు మొదలుపెట్టి ధర్మవరం రైల్వే స్టేషన్ వద్ద పట్టుకున్నారు. నాగులూరుకు చెందిన హేమంత్గా పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై సిఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. సిఎం చంద్రబాబు నాయుడు ఆ విద్యార్ధిని తల్లితో మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పారు. ఆ బాలికకు అత్యుత్తమ వైద్య చికిత్స అందించి కాపాడుతామని, ఆమెపై దాడి చేసిన ఆ దుండగుడుకి కటినాతి కటినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, “చిన్నారి చెల్లిని క్లాస్ రూములో నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదు. గుండె బరువెక్కింది. రాప్తాడులో ఉన్మాది ఘాతుకం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉన్మాదులను ఉక్కు పాదంతో అణిచేస్తాం. ఆడపిల్లలు, మహిళల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తాం. పిల్లల భద్రత పట్ల నిర్లక్ష్యం వహించేవారు ఎంతటి వారైనా చర్యలు తప్పవు,” అని ట్వీట్ చేశారు.