రవితేజ ఇరుముడి మూవీ నిర్మాతలకు కార్మిక శాఖ నోటీసులు…!

రవితేజ ఇరుముడి మూవీ నిర్మాతలకు కార్మిక శాఖ నోటీసులు…

సినిమాలో ఓ మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించడంతో నోటీసులు జారీ..

బాలిక సినిమా షూటింగ్‌లో నటించడానికి ముందు జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి తీసుకున్నారా?

అలాగే బాలిక తల్లిదండ్రుల నుండి అధికారిక సమ్మతి పత్రం పొందారా అంటూ మూవీ టీంను ప్రశ్నలు అడిగిన తెలంగాణ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్..

బాలికకు సంబంధించిన కాల్ షీట్లు, అటెండెన్స్ రికార్డులు, షూటింగ్‌లో పాల్గొన్న పని గంటల వివరాలు, బాలిక చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా తీసుకున్న చర్యలు, ఆమె భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక సంరక్షకుడిని నియమించారా అనే వివరాలు స్పష్టం చేయాలని ఆదేశం..

బాలిక పారితోషికంలో 20 శాతం ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో జమ చేశారా, సినిమా ప్రమోషన్ ఈవెంట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలిక పాల్గొనేలా చేయడంపై వివరణ ఇవ్వాలని కోరిన అధికారులు..

ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో నవంబర్ 4 ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సినిమా నిర్మాతలకు నోటీసులు జారీ చేసిన కార్మిక శాఖ అధికారులు..

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. సినిమాలో మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించడంపై తెలంగాణ కార్మిక శాఖ (లేబర్ డిపార్ట్‌మెంట్) రంగంలోకి దిగింది. బాల కార్మిక చట్టాలు, నిబంధనలు పాటించారా లేదా అనే అంశంపై వివరణ ఇవ్వాలని సినిమా నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది…జై లోక్ సత్తా సోషల్ జస్టిస్ ఫోరం చేసిన ఫిర్యాదు మేరకు తెలంగాణ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఈ నోటీసులు ఇచ్చింది. మైనర్ బాలికను సినిమా షూటింగ్‌లో భాగం చేయడానికి జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారా? బాలిక తల్లిదండ్రుల సమ్మతి పొందారా? అనే అంశాలపై అధికారులు ప్రశ్నించారు…అంతేకాకుండా బాలికకు సంబంధించిన కాల్‌షీట్లు, అటెండెన్స్ రికార్డులు, షూటింగ్‌లో పాల్గొన్న పని గంటల వివరాలను సమర్పించాలని ఆదేశించారు. షూటింగ్ కారణంగా బాలిక చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారా? ఆమె భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక బాధ్యుడిని నియమించారా? అనే వివరాలను కూడా కోరారు.

మైనర్ బాలికకు చెల్లించిన పారితోషికంలో కనీసం 20 శాతాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో జమ చేశారా? అనే అంశంపై కూడా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

సినిమా షూటింగ్‌కే పరిమితం కాకుండా ‘ఇరుముడి’ ప్రమోషనల్ కార్యక్రమాలు, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లలోనూ మైనర్ బాలిక పాల్గొనడంపై అధికారులు వివరణ కోరారు. ఆయా కార్యక్రమాల్లో బాలిక పాల్గొనే విషయంలో నిబంధనలు పాటించారా? అనే అంశాన్ని స్పష్టం చేయాలని నిర్మాతలను ఆదేశించారు.

ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో నవంబర్ 4న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ‘ఇరుముడి’ నిర్మాతలకు కార్మిక శాఖ సమన్లు జారీ చేసింది. గత ఆగస్టు 21న విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ఈ చిత్రానికి, ఆ విజయానంతరం బాల కార్మిక చట్టాల రూపంలో నోటీసులు రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక దీనిపై నిజానిజాలు తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సిందే.