బీఆర్ఎస్ నేత, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నాయకుడిని అరెస్టు చేయడం ఏమిటని నిలదీశారు. రాజకీయ విమర్శలకు రాజకీయంగానే సమాధానం చెప్పాలని, పోలీసు కేసులతో అణచివేయాలని చూడటం సరికాదని మండిపడ్డారు…కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భార్య ఇందుజా రెడ్డి ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు బాలరాజు యాదవ్‌ను అరెస్టు చేశారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుపై బల్మూరి వెంకట్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బాలరాజు యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయడమేంటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ అరెస్టుపై తాజాగా కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అరెస్టు పేరుతో బాలరాజు యాదవ్‌ను నగరమంతా తిప్పుతూ ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమని విమర్శించారు. రాజకీయ విమర్శలకు సమాధానం రాజకీయంగానే చెప్పాలి తప్ప పోలీసు కేసులతో కాదని హితవు పలికారు…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.