న్యూజిలాండ్ (India vs New Zealand) వన్డే క్రికెట్ పోరులో ఓ ఆసక్తికరమైన గణాంకం వెలుగులోకి వచ్చింది. కివీస్ జట్టు భారత బౌలర్లను ఎదుర్కొంటూ తొలి ఐదు ఓవర్లలో పరుగులు సాధించడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది…తాజాగా వెల్లింగ్టన్లో జరుగుతోన్న మ్యాచ్‌లో 5 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 7 పరుగులు సాధించింది. ఈ క్రమంలో 2019 ప్రపంచకప్ సెమీఫైనల్ నాటి ప్రదర్శన మళ్లీ గుర్తుకొచ్చింది. అప్పట్లో కూడా న్యూజిలాండ్ తొలి ఐదు ఓవర్లలో వికెట్ కోల్పోయి కేవలం ఏడు పరుగులే చేసింది. ఇప్పుడు అదే తరహా గణాంకం మరోసారి తెరపైకి రావడంతో క్రికెట్ అభిమానులు ఈ విషయంపై ఆసక్తి చూపిస్తున్నారు.
2019 జూలై 9న ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ప్రపంచకప్ సెమీఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టుకు భారత పేసర్లు ఆరంభంలోనే చుక్కలు చూపించారు. జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అద్భుతమైన బంతితో మార్టిన్ గప్టిల్ (Martin Guptill)ను పెవిలియన్‌కు పంపించాడు. గప్టిల్ 14 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు…
ప్రస్తుతం స్కోర్..
టాస్ ఓడి ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తోన్న న్యూజిలాండ్ టీం 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసింది. అఖిబ్ నబీ, మొదట టిమ్ సీఫెర్ట్‌ను, ఆ తర్వాత విల్ యంగ్‌ను ఔట్ చేశాడు. అన్షుల్ ఒక వికెట్ పడగొట్టాడు.