అస్సాంలో ఘోరమైన రైలు ప్రమాదం..!

అస్సాంలోని గౌహతి శివార్లలో ఉన్న దిగారు రైల్వే స్టేషన్ సమీపంలో కోల్‌కతా–సైరంగ్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 13125) పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైలు ఇంజిన్‌తో పాటు 5 నుండి 6 బోగీలు పట్టాలు తప్పాయి.

ఈ ఘటనలో రైలు ఇంజిన్‌తో పాటు 5 నుండి 6 బోగీలు పట్టాలు తప్పాయి..

బుధవారం ఉదయం అస్సాంలో ఘోరమైన రైలు ప్రమాదం జరిగింది. గౌహతి శివార్లలోని దిగారు సమీపంలో కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడినట్టు తెలిపారు….
ఉదయం 06:54 గంటల ప్రాంతంలో, అస్సాంలోని దిగారు రైల్వే స్టేషన్‌లో మరో రైలుకు ప్రాధాన్యత ఇవ్వడానికి 13125 నంబర్ కోల్‌కతా – సైరంగ్ ఎక్స్‌ప్రెస్ రైలును స్వీకరిస్తుండగా, లోకో పైలట్ వేగాన్ని నియంత్రించలేకపోయాడు. దీని ఫలితంగా రైలు పట్టాలు తప్పినట్లుగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

గౌహతి శివార్లలోని దిగారు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రైలులోని పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అయితే, గాయపడిన వారి కచ్చితమైన సంఖ్య ఇంకా తెలియరాలేదు. ఎంతమంది ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందో కూడా ఇంకా నిర్ధారణ కాలేదు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. రైల్వే శాఖ ఒక సహాయక రైలును కూడా సంఘటనా స్థలానికి పంపింది. పోలీసులు, రైల్వే రక్షణ దళం, స్థానిక పరిపాలన బృందాలు కూడా సంఘటనా స్థలంలో ఉన్నారు. గాయపడిన వారిని తరలించి, మిగిలిన ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి..
Kolkata Sairang Express Derail:
సహాయక, రెస్క్యూ ఆపరేషన్లను వెంటనే ప్రారంభించారని, జనరల్ మేనేజర్ ఇతర అధికారులతో కలిసి ప్రమాద స్థలానికి వెళ్లారని తెలిసింది. ఆ రైలు మిజోరం నుంచి కోల్‌కతాకు ప్రయాణిస్తోందని నివేదికలు తెలిపాయి..