జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి.
కుల్గామ్‌లోని సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై దాడి.
జవాన్లపై ఉగ్రవాదుల కాల్పులు.
ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు.
ఉగ్రవాదుల కోసం బలగాల సెర్చ్ ఆపరేషన్
CRPF personnel were injured in the Kulgam..
జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు మెరుపుదాడికి తెగబడ్డారు. నాకా తనిఖీల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులు జరపడంతో ముగ్గురు గాయపడ్డారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు కొనసాగుతున్నాయి..
జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. నాకా తనిఖీల్లో భాగంగా విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. మధ్యాహ్నం సుమారు 2:15 గంటల సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని సాయుధ ఉగ్రవాదులు ఒక్కసారిగా జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ వెంటనే అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. ఈ మెరుపుదాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు….
మధ్యాహ్నం సుమారు 2:15 గంటల సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని సాయుధ ఉగ్రవాదులు వాహన తనిఖీలు చేస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బందిపై ఒక్కసారిగా ఆటోమేటిక్ రైఫిళ్లతో కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు…