హుజూర్నగర్ మున్సిపాలిటీ నిధుల ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి..!
*జనరల్ ఫండ్, క్యాపిటల్ ఫండ్ లెక్కలు బహిర్గతం చేయాలి..
*మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్‌కు ఐదుగురు కౌన్సిలర్ల వినతి పత్రం*
*అధికార కాంగ్రెస్ పార్టీ లో ఆగని లొల్లి..
*సొంత పార్టీ చైర్మన్ పైనే తిరుగుబాటు జెండా..
*రెండుగా చీలిపోయి విమర్శలు గుప్పించుకుంటున్న పాలకవర్గం..
మంత్రి ఉత్తం ఇలాకాలో అధికార పార్టీ పాలకవర్గం రెండుగా చీలిపోయి విమర్శలు..
*సూర్యాపేట జిల్లా – హుజూర్నగర్:*
హుజూర్నగర్ మున్సిపాలిటీలో జనరల్ ఫండ్, క్యాపిటల్ ఫండ్ కింద మంజూరైన నిధులు, వాటి వినియోగం, ఖర్చులపై పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతూ ఐదుగురు కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఇటీవల నిర్వహించిన మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో నిధుల వివరాలను అధికారులు సంక్షిప్తంగా వెల్లడించారని, అయితే పూర్తి స్థాయి లెక్కలు ప్రజాప్రతినిధులకు అందించాలని వారు కోరారు.
మున్సిపాలిటీలో ఇంజనీరింగ్, శానిటేషన్ తదితర విభాగాల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు, కాంట్రాక్టర్లకు అప్పగించిన పనులు, కేటాయించిన నిధులు, చేసిన ఖర్చులు, చెల్లింపుల వివరాలను వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సిబ్బంది వేతనాలు, వార్డుల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులు, వాటికి సంబంధించిన బిల్లులు, చెల్లింపుల వివరాలను అందించాలని కోరారు.
ప్రజాధనం వినియోగంలో పారదర్శకత ఉండాలని, మున్సిపాలిటీ ఆదాయ, వ్యయాలపై ప్రజలకు స్పష్టత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. జనరల్ ఫండ్, క్యాపిటల్ ఫండ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని కమిషనర్‌ను కోరారు… అధికార పార్టీలోనే రెండు వర్గాలుగా చీలిపోయి ఈ విధంగా ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకుంటూ ఉండడంతో ఒకసారిగా హుజూర్‌నగర్‌లో అధికార పార్టీలోనే రెండు వర్గాలుగా చీలి ఇలా పంచాయతీలు పెట్టుకోవడంతో మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిల్లో వేడెక్కింది. మంత్రి ఉత్తం ఇలాకాలో ఇలా జరగటం ప్రస్తుతం రాజకీయ చర్చ నియాంశంగా మారింది.. ఇది ఎంతవరకు వెళుతుంది అనేది ఇంకా వేయించి చూడాల్సిందే..ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు:..- 1వ వార్డు.. కోడి జ్యోతి ఉపేందర్ –
8వ వార్డు కోల ఉదయభాను.. 22వ వార్డు-..అమరబోయిన ఊహ సతీష్ ..
23వ వార్డు అట్లూరి మంజుల హరిబాబు… 24వ వార్డు..యడ్ల విజయ్ ..