ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ అడుగుపెట్టింది. మాజీ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కొత్త పార్టీని ప్రకటించారు. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ పేరుతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ వేదికగా నవంబర్ 11న ఉదయం 11 గంటల 31 నిమిషాలకు పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయ వేదికగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు..
ప్రత్యేక ముహూర్తంలో పార్టీ ఆవిర్భావం.
రాజకీయ రంగప్రవేశం కోసం విజయసాయిరెడ్డి అత్యంత విశిష్టమైన సమయాన్ని ఎంపిక చేసుకున్నారు. నవంబర్ 11వ తేదీ, సరిగ్గా ఉదయం 11 గంటల 11 నిమిషాలకు (11/11, 11:11) ఈ పార్టీ ఆవిర్భావ కార్యక్రమం జరగనుంది. సంఖ్యాశాస్త్రం లేదా సెంటిమెంట్ పరంగా ఈ ముహూర్తానికి ఎంతో ప్రాధాన్యత ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక సమయం కేవలం రాజకీయాల్లోనే కాకుండా ప్రజల్లో కూడా విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది..కొత్త పార్టీ విధివిధానాలు, అనుసరించబోయే రాజకీయ వ్యూహాలు మరియు భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతున్నాయనే దానిపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఏపీలో ఇప్పటికే ఉన్న ప్రధాన పార్టీలకు ఈ నూతన వేదిక ఏ మేరకు ప్రత్యామ్నాయంగా మారుతుందనేది త్వరలోనే స్పష్టత రానుంది. .
పార్టీ ఎజెండాలో యువతకు 66 శాతం అవకాశాలు కల్పించడం ప్రధాన అంశంగా ప్రకటించారు. యువత రాజకీయాల్లోకి రావాలని, నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని విజయసాయిరెడ్డి భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వడం, అభివృద్ధి, ఉపాధి కల్పన, విద్య, వ్యవసాయం వంటి అంశాలపై పార్టీ దృష్టి సారించనుంది. గతంలో ప్రకటించిన ప్రణాళికల్లో రైతులకు ఉచిత విద్యుత్, నీటి నిల్వ సామర్థ్యం పెంపు, యువతకు ఉద్యోగ అవకాశాలు, ప్రజల ఆదాయాలు పెంచడం వంటి అంశాలను కూడా విజయసాయిరెడ్డి ప్రస్తావించారు..
పి అర్ పి అదే పేరు… కానీ అర్థాలు వేరు..
పరివర్తన రాజనీతి పార్టీ (PRP) పేరుతో విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటన..
పిఆర్పి అంటూ ఇంగ్లీషులో వచ్చేలా ఏర్పాటుచేసిన విజయసాయిరెడ్డి.. అయితే పి ఆర్ పి గతంలో చిరంజీవి కూడా ఏర్పాటు చేసిన పార్టీ అది అందరికీ తెలుసు.. కానీ పిఆర్పి తెలుగులో మీనింగ్ వచ్చేసరికి అర్థాలు మారిపోయాయి… గతంలో ప్రజారాజ్యం పార్టీ అని వచ్చేది.. ఇప్పుడు పరివర్తన రాజనీతి పార్టీ అంటూ విజయసాయి రెడ్డి స్థాపించారు…
రెండు కుటుంబాలే రాజకీయని శాసిస్తున్నాయి..
రెండు కుటుంబాలే శాసించాలా.. ఆ కుటుంబాల ఆధిపత్యం వద్దని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. ఆ రెండు కుటుంబాల నుంచే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కావాలా అని ప్రశ్నించారు. తండ్రి సీఎం అయితే కుమారుడు సీఎం కావాలా అని అడిగారు. ప్రతి కులంలో నాయకులు ఉంటారు.. పుడతారని చెప్పుకొచ్చారు. వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పి యువతనే సీఎంగా చేయాలనేది తమ పార్టీ లక్ష్యమని వ్యాఖ్యానించారు. తుఫాన్ వచ్చినప్పుడు ప్రశాంతత ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో రాజకీయ ప్రకంపనలు జరగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పాలకుల అరాచక పాలనపై విస్ఫోటనం ఎలా ఉంటుందో భవిష్యత్తులో ప్రజలే చూస్తారని అన్నారు. దుష్ట పరిపాలనకు ఈ సందర్భంగా తాను సవాల్ విసురుతున్నానని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు..
ఇంకా వేచి చూడాలి సిందే పిఆర్పీల ఫిరాయిస్తారా,, లేదా గట్టి పోటీ నిచ్చే ఆంధ్రాలో నిలుచుంటారా అనేది వేచి చూడాల్సిందే మరి..