Milk Price Hike: .. దేశవ్యాప్తంగా పాల ధరలను పెంచిన కంపెనీలు…

దేశవ్యాప్తంగా పాల ధరలను పెంచిన కంపెనీలు…

లీటర్‌కు రూ.2 నుంచి 4 వరకు పెంచిన మదర్ డైరీ, అమూల్.

పశుగ్రాసం ధరలు, ప్యాకేజింగ్..
ఇంధన చార్జీల పెరుగుదలే కారణమని కంపెనీల ప్రకటన

milk-price-hike
నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్య వినియోగదారుడి జేబుకు మరో గండి పడింది. దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో అతిపెద్ద పాల సరఫరాదారు అయిన మదర్ డెయిరీ (Mother Dairy) పాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల పాల ప్యాకెట్లపై లీటరుకు రూ.2 నుంచి రూ.4 వరకు పెంచింది. పెరిగిన ఈ నూతన ధరలు గురువారం (నవంబర్ 12) నుంచే తక్షణమే అమల్లోకి వస్తాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రైతుల నుంచి పాల సేకరణ వ్యయం (ఇన్‌పుట్ కాస్ట్) భారీగా పెరగడం వల్లే ధరలను సవరించాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. తాము పొందే రాబడిలో 75 నుంచి 80 శాతాన్ని రైతులకు చెల్లింపుల రూపంలోనే అందజేస్తామని తెలిపాయి. కాగా, ఈ పెంపుపై అధికారికంగా స్పందించేందుకు మదర్ డెయిరీ ప్రతినిధి నిరాకరించారు.

కొత్త ధరల ప్రకారం ఫుల్‌ క్రీమ్‌ ప్యాకెట్‌ పాల లీటరు ధర రూ.72 నుంచి రూ.76కు పెరిగింది. టోన్డ్‌ ప్యాకెట్‌ పాలు రూ.60 నుంచి రూ.62కు చేరాయి. డబుల్‌ టోన్డ్‌ పాలు రూ.54 నుంచి రూ.56కు పెరిగాయి. ఆవు పాల ధర లీటరుకు రూ.62 నుంచి రూ.65కు చేరింది. బల్క్‌ వెండింగ్‌ కేంద్రాల ద్వారా విక్రయించే టోన్డ్‌ పాలు రూ.58 నుంచి రూ.60కు పెరిగాయి.

పాడి రైతుల నుంచి పాలు సేకరించేందుకు చెల్లించే ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మదర్‌ డెయిరీ తన పాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో 75 నుంచి 80 శాతం వరకు రైతులకు చెల్లిస్తోంది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో మదర్‌ డెయిరీ రోజుకు సుమారు 35 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తోంది. సంస్థకు చెందిన అవుట్‌లెట్లు, సాధారణ విక్రయ కేంద్రాలు, ఆన్‌లైన్‌ వేదికల ద్వారా ఈ అమ్మకాలు సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా రోజువారీ పాల విక్రయాలు 50 లక్షల లీటర్లకు పైగా ఉన్నాయి. ఈ ఏడాది మే 14న చివరిసారిగా ధరలను సవరించిన సంస్థ.. ఆరు నెలల వ్యవధిలో మరోసారి పెంపు నిర్ణయం తీసుకుంది.