రేపు పుతిన్‌, ట్రంప్‌, జిన్‌పింగ్ మ‌ధ్య చ‌ర్చ‌లు..ఇక చైనాకు ఏఐ చిప్స్ స‌ర‌ఫ‌రాను నిలిపివేస్తున్న‌ట్లు ఎన్విడియా ప్రకటన..!.

షెంజెన్‌లో ట్రంప్‌కు గ్రాండ్ వెల్క‌మ్ ప‌లికారు జిన్‌పింగ్‌. విమానం దిగి వ‌చ్చిన ట్రంప్‌ను చైనా అధ్య‌క్షుడు హ‌త్తుకున్నారు. రేపు పుతిన్‌, ట్రంప్‌, జిన్‌పింగ్ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక చైనాకు ఏఐ చిప్స్ స‌ర‌ఫ‌రాను నిలిపివేస్తున్న‌ట్లు ఎన్విడియా ప్ర‌క‌టించింది… ఇదే సంవ‌త్స‌రం జిన్ పింగ్ అమెరికాలో టూర్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో వాషింగ్ట‌న్‌లో విమానాశ్ర‌యానికి వెళ్లి ట్రంప్ స్వాగ‌తం ప‌లికారు. అయితే ఎపెక్ స‌మావేశాల్లో పాల్గొనేందుకు ట్రంప్ షెంజెన్ చేరుకున్నారు. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌తో క‌లిసి రేపు ముగ్గురు స‌మావేశంకానున్నారు. జ‌పాన్ ప్ర‌ధాని స‌నేయి ట‌కాయిచి కూడా షెంజెన్ చేరుకున్నారు. తొలిసారి ఆమె చైనాలో ప‌ర్య‌టిస్తున్నారు. తైవాన్ అంశంలో ఈ రెండు దేశాల మ‌ధ్య ఇటీవ‌ల మాట‌ల యుద్ధం సాగింది…మ‌రో వైపు అమెరికాకు చెందిన ఎన్విడియా కంపెనీ త‌న ఏఐ చిప్స్ స‌ర‌ఫ‌రాను చైనాకు నిలిపివేసింది. చైనా మ‌హిళ‌తో రిలేష‌న్‌లో ఉన్న‌ట్లు చెప్పిన ఎన్విడియా సీఈవో జేన్స‌న్ హువాంగ్‌ను ఇటీవ‌ల ఆ కంపెనీ తొల‌గించిన విష‌యం తెలిసిందే. అలిస్ హువాంగ్ వ్యాపారి కాదు అని, ఆమెకు చైనా ఇంటెలిజెన్స్‌తో సంబంధాలు ఉన్నాయ‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అయితే చిప్స్ త‌యారీలో నెంబ‌ర్ వ‌న్ అయిన ఎన్విడియా.. త‌న కంపెనీ ఉత్ప‌త్తుల‌ను చైనాకు అమ్మ‌రాదు అని నిర్ణ‌యించింది.