బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాన్‌..!

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాన్‌

ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపు పయనం
గంటకు 8 కి.మీ. వేగంతో కదులుతున్న తుఫాన్..

నరసాపురానికి 520 కి.మీ, చెన్నైకి 560 కి.మీ..

పూరికి 720 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
20న నరసాపురం-పూరి మధ్య తీరం దాటే అవకాశం.

తీరందాటే సమయంలో 110 కి.మీ. వేగంతో గాలులు..

ఒడిశా తీరాల వైపు వేగంగా కదులుతోంది. ప్రస్తుతం గంటకు 8 కి.మీ వేగంతో పయనిస్తున్న ఈ తుఫాన్, నరసాపురానికి 540 కి.మీ, చెన్నైకి 570 కి.మీ మరియు పూరికి 750 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాన్ 20వ తేదీన నరసాపురం-పూరి మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు సుమారు 110 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


తుఫాన్‌ తీరం దాటే ఛాన్స్
..

తాజా వాతావరణ అంచనాల ప్రకారం.. అక్వాన్ తుఫాన్ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సమీపంలో తుఫాన్‌గా తీరం దాటే అవకాశం ఉంది. అయితే, సముద్రం నుంచి తీరానికి దగ్గరవుతున్న కొద్దీ దీని తీవ్రత మరింత తగ్గే సూచనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు…గాలుల వేగం కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉండటంతో భారీ తుఫాన్ ప్రభావం నుంచి రాష్ట్రానికి ఉపశమనం లభించవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ముప్పు పూర్తిగా తొలగిపోయిందని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని అంటున్నారు.

పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు :
ఉత్తర కోస్తాంధ్రలోని పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. తీర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా సముద్రంపై ఆధారపడి జీవించే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ఎవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లకూడదని స్పష్టం చేస్తున్నారు.

వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా తుఫాన్ దిశ, తీవ్రతలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పీఎల్ఎన్ మూర్తి వెల్లడించారు. అక్వాన్ తుఫాన్ తీవ్రత తగ్గే సూచనలతో ఏపీకి కొంత ఊరటనిచ్చే విషయమే అయినా తీర ప్రాంత ప్రజలు వాతావరణ శాఖ సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరమని అధికారులు చెబుతున్నారు…