పురాతన బావి సంరక్షణ కమిటీ…ఇంటింటికి తిరుగుతూ బావి పునరుద్దరణ కు రూపాయి చందా వసూలు..!

యాదాద్రి భువనగిరి జిల్లా:

ఆలేరు లోని పాత మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణంలో దాదాపు 60 ఏండ్ల నుండి ఉన్న ఎర్ర ట్యాంక్ బావి…గతంలో గ్రామానికి నీటిని అందించింది…నిత్యం నీటితో నిండు కుండల ఉన్న బావి కాలక్రమేణా నిర్లక్ష్యానికి గురై మరుగున పడిపోయింది…బావిలో నీటి ని వినియోగించుకోక నిరుపయోగంగా వదిలి వేయడంతో…బావిలో పూడిక పెరిగి..చెత్త చెదారం,మట్టితో నిండిపోయి..బావి పూర్తిగా వాడుకకు నోచుకోకుండాపోయింది…బావిని పట్టించుకునే నాధుడే కరువయ్యారు..

మరోవైపు ఎల్నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గడం..

ప్రభుత్వం సైతం నీటిని పొదుపుగా వాడుకోవాలని నిత్యం సూచనలు చేస్తున్నారు…రానురాను నీటి లభ్యత తగ్గే అవకాశం ఉండే సూచనలు చేస్తున్నారు..దీంతో ఆలేరు లోని పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద వెళ్లిన ఆలేరు కు చెందిన రవి అనే వ్యక్తి 10 మంది సభ్యుల బృందానికి ఎర్ర ట్యాంక్ బావి పై దృష్టి పడింది

దీంతో పురాతన బావి సంరక్షణ కమిటీ ఏర్పాటు చేసుకుని పురాతన బావి సంరక్షణ కమిటీ చైర్మన్ గా ముల్లక్కెల రవికుమార్, వైస్ చైర్మన్ గా నంద గంగేష్, కన్వీనర్‌ పాకాల హరీష్, మరి కొందరితో కలిసి కమిటీ ఏర్పాటు చేసుకున్నారు..

ఎల్ నినో ప్రభుత్వం నీటి లభ్యత తగ్గే అవకాశం ఉండటంతో చెత్త చెదారం తో నిండిన ఎర్రబావి పునరుద్ధరణ చేయాలనే ఆలోచనలో పడ్డారు 10 మంది సభ్యులతో కూడిన పురాతన బావి సంరక్షణ కమిటీ చెర్మెన్ రవి బృందం..పునరుద్దరణ చేస్తే ప్రజలకు నీరందే అవకాశం ఉందని ఆలోచించారు… దీంతో పునరుద్ధరణ చేయాలని అధికారుల దృష్టి పలుమార్లు తీసుకువెళ్లారు.. ప్రజాప్రతినిధులకు సైతం విన్నవించుకున్నారు… అయితే ఎర్ర ట్యాంక్ బావి పునరుద్దరణ అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందుకు రాకపోవడంతో తామే పునరుద్ధరణ చేస్తామని ముందడుగు వేశారు…అధికారులకు,ప్రజాప్రతినిధులకు కన్నువింపు కలిగేలా ఒక రూపాయి ఉద్యమ చేపట్టారు..
ఇంకా ముందుగా ప్రజాప్రతినిధులు,అధికారులకు బావి పునరుద్దరణ పై కన్నువింపు కలిగేలా ఒక్క రూపాయి ఉద్యమ పేరుతో కావడికి బిందెలు కట్టుకుని గుజ్జుల రామచంద్ర రెడ్డి తో ఇంటింటికి తిరుగుతూ బావి పునరుద్దరణ కు రూపాయి ఇచ్చి సహకరించాలని కోరారు ఈ బృందం కోరింది…ప్రజలు ఒక్క రూపాయ ఇవ్వడంతో పాటు పలువురు చిన్నారులు సైతం దాచుకున్న డబ్బులు కొంత ఇచ్చారని రవి బృందం తెలిపింది…అలా వచ్చిన డబ్బుతో పాటు సొంత డబ్బులు పెట్టుకుని యంత్రాల సహాయంతో బావిలోని పూడిక,చెత్త చెదారం,మట్టి పూర్తిగా బయట తీశారు…
యంత్రాల సహాయంతో బావిలోని పూడిక,చెత్త చెదారం,మట్టి పూర్తిగా బయటికీ తీయడంతో బావి పునరుద్ధరణకు నోచుకుంది…బావిలో నీటి మట్టం సైతం పెరిగింది…పాత బావి పునరుద్దరణ కు నోచుకోని నీటి మట్టం పెరగడంతో ఆలేరు లో నీటి సమస్యకు కొంత పరిష్కారం లభించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు….