కార్తీకమాసం విశేషాలు…

*కార్తీకమాసం విశేషాలు.

కార్తీక మాసం.. ఆది దేవుడికి ఎంతో ప్రీతికరం. శివుడు.. గంగాదేవి.. పార్వతి దేవికి కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అంటుంటారు. ఈ మాసంలో వ్రతాలు.. నోములతోపాటు..దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆశ్వయుజ అమావాస్య మరుసటి రోజు కార్తీకమాస పాడ్యమి నుంచి కార్తీక అమావాస్య వరకు కార్తీక మాసం ఉంటుంది. ఈ మాసం శివారాధన చేయడం వలన పుణ్యఫలాల్ని ఇస్తాయి. ఈమాసంలో ఉపవాసాలు ఆచరించడం వలన ఎన్నో శుభఫలితాలుంటాయి….

• నవంబరు 02 స్థిరవారం నుండి కార్తీక మాసం మొదలవుతోంది.

• నవంబరు 03 ఆదివారం యమవిదియ – భగినీహస్త భోజనం

• నవంబర్ 04 మొదటి కార్తీక సోమవారం

• నవంబరు 05, మంగళవారం
నాగుల చవితి

• నవంబర్ 11 రెండవ కార్తీక సోమవారం

• నవంబరు 12 మంగళవారం ఏకాదశి

• నవంబరు 13 బుధవారం
క్షీరాబ్ది ద్వాదశి దీపాలు

• నవంబరు 15 శుక్రవారం – కార్తీకపూర్ణిమ

• నవంబర్ 18 కార్తీకమాసం మూడో సోమవారం

• నవంబర్ 25 కార్తీకమాసం నాలుగో సోమవారం

• నవంబర్ 26 కార్తీక బహుళ ఏకాదశి

• నవంబర్ 29 కార్తీక మాసం మాస శివరాత్రి

• డిసెంబర్ 1, ఆదివారం కార్తీక అమావాస్య

• డిసెంబర్ 2 సోమవారం మార్గశిర శుధ్ధ పాడ్యమి
పోలి స్వర్గం

ఈ ఏడాది నవంబరు 02 స్థిరవారం నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది డిసెంబరు 02, సోమవారం పోలిస్వర్గంతో కార్తీకమాస దీక్ష పూర్తవుతుంది.