నేటి పంచాంగం.. నేటి మాట..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌻పంచాంగం🌻
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 17 – 11 – 2024,
వారం … భానువాసరే ( ఆదివారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయణం,
శరదృతువు,
కార్తీక మాసం,
బహుళ పక్షం,

తిథి : విదియ రా11.26 వరకు,
నక్షత్రం : రోహిణి రా8.12 వరకు,
యోగం : శివం రా11.53 వరకు,
కరణం : తైతుల మ12.18 వరకు,
తదుపరి గరజి రా11.26 వరకు,

వర్జ్యం : మ12.34 – 2.05,
మరల రా1.37 – 3.10,
దుర్ముహూర్తము : మ3.51 – 4.36,
అమృతకాలం : సా5.09 – 6.40,
రాహుకాలం : సా4.30 – 6.00,
యమగండం : మ12.00 – 1.30,
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : వృషభం,
సూర్యోదయం : 6.09,
సూర్యాస్తమయం: 5.21,

*_నేటి మాట_*

*”దైవానుగ్రహాన్ని ఎందువల్ల గుర్తించలేకపోతున్నాము?”*

“దీనికి మనలోని స్వార్థం, సంకుచితత్వమే కారణం”…

ప్రతి చిన్న కష్టానికి దేవుడి దయ లేదంటూ మన అజ్ఞానాన్ని చాటుకుంటాము,

మన వేలుకో, కాలుకో వచ్చిన చిన్న బాధను గుర్తిస్తున్నామే కాని మిగిలిన శరీరమంతా బాగుందన్న సత్యం గ్రహించలేకపోతున్నాము!!…

దైవానుగ్రహం నిరంతరంగా, మనపైన మరియు ఈసృష్టి అంతట వ్యాపించి ఉన్నా గుర్తించలేకపోతున్నాము,

శరీరధర్మాలకు, మనసు పోకడలకు భిన్నంగా ఉండటం ఎంతో కష్టం.
సుఖదుఃఖాలు, కష్టనష్టాలు అర్థం చేసుకుని జీవించడం ద్వారా సమదృష్టి ఏర్పడుతుంది.

” మనలో స్థిరాస్తిగా ఉన్న దైవం, ఈమనోదేహాలచే చరాస్తులుగా మారటం, ప్రకృతిలోని అంతర్భాగమే !
సైన్స్ మాటల్లో చెప్పాలంటే స్థితిశక్తిగా ఉన్న ఆత్మ, ఈశరీరం, మనసుచేసే పనుల కోసం గతిశక్తిగా మారుతోంది !”

*_🌻శుభమస్తు🌻_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏