నేటి పంచాంగం.. నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🏵️పంచాంగం🏵️
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 11 – 12 – 2024,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
శుక్ల పక్షం,

తిథి : *ఏకాదశి* రా10.43 వరకు,
నక్షత్రం : *రేవతి* ఉ10.03 వరకు,
యోగం : *వరీయాన్* సా5.50 వరకు,
కరణం : *వణిజ* ఉ11.54 వరకు,
తదుపరి *భద్ర* రా10.43 వరకు,

వర్జ్యం : *తె4.39 – 6.08*
దుర్ముహూర్తము : *ఉ11.31 – 12.15*
అమృతకాలం : *ఉ7.49 – 9.18*
మరల *రా1.41 – 3.10*
రాహుకాలం : *మ12.00 – 1.30*
యమగండం : *ఉ7.30 – 9.00*
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : మీనం,
సూర్యోదయం : 6.24,
సూర్యాస్తమయం: 5.23,

*_నేటి విశేషం_*

*గీతాజయంతి*
మార్గశిర శుక్ల పక్ష ఏకాదశి గీతా జయంతిగా పాటించబడుతుంది…

ఈరోజునే కురుక్షేత్ర సంగ్రామ సందర్భంగా కృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు.
ఈ భగవద్గీత మోక్ష ప్రాప్తికి సాధనం గనుకే గీతా జయంతికెంతో పవిత్రత, శత్రువుతో పోరాడమని, తన విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తించమనీ భగవానుని ఆదేశం.
ఈ పర్వదినాన్ని మోక్షదా ఏకాదశి అనీ అంటారు…

గీతా పఠనం ద్వారా జన్మ రాహిత్యం లభిస్తుందని కూడా పెద్దలంటారు.
గీతాచార్యుని బోధ శిరోధార్యం.
‘గీతా’ ప్రకారం మానవుడు మహాభావుడు, అమరుడు, అనంతశక్తి భాండారం వంటివాడు.
‘భగవద్గీత’ ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఒక పర్యాయం మహాత్మాగాంధి ఇలా ప్రవచించాడు: “నా ఆలోచనా ద్వారా నేను ఏదయినా సమస్యను పరిష్కరించ లేకపోతే, స్ఫూర్తికోసం గీతను ఆశ్రయిస్తాను. “గీతోపదేశసారం,” కర్మణ్యేవాధికారస్తే, మాఫలేషుకథాచన” అంటే దాని అర్థం- “కర్మ ఆచరించు, కానీ దాని ఫలంగురించి ఆశించకు”

*పూజా విధానం*
ఒక పూలహారం, ఒకదీపం, మిఠాయిలతో తయారైన ప్రసాదం-ఇవీ పూజా సామగ్రి, గీతను పూజించాక, గీతా పఠనం, హారతి ఇవ్వడం జరుగుతాయి.
అసలు ఈ పండుగ ఉద్దేశం – గీత సిద్దాంతాలు, ఉపదేశాలు, ఆత్మానుభవంలోకి తెచ్చుకుని, జీవితాన్ని ఆ ప్రకారం తీర్చిదిద్దుకోవాలి, అదే ‘భగద్గీత’ కు నిజమైన ఆరాధన.

*_🏵️శుభమస్తు🏵️_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏