సప్తనదీ సంగమ ప్రాంతంలో కృష్ణానది నీటిలో మునిగి ఉన్న సంగమేశ్వరాలయ గోపురం తేలింది. కొంతకాలంగా నీటిమట్టం తగ్గుతూ వస్తోంది..ఆలయ గోపుర శిఖరం కొన్నిరోజుల కిందటే తేలడంతో భక్తులు మరబోట్లలో వెళ్లి శిఖర భాగాన్ని దర్శించుకుని వచ్చేవారు. సోమవారం ఆలయ గర్భగుడి గోపురం పూర్తిగా దర్శనమిచ్చింది. ఆలయ అర్చకులు రఘురామశర్మ మరబోటులో వెళ్లి గోపురానికి పూజలు చేశారు. గోపురం దర్శనానికి వచ్చే భక్తులు ఆలయ ప్రాంగణానికి దూరంగా ఉండి దర్శించుకోవాలని, గోపురం దగ్గరికి వస్తే ప్రాంగణంలోని ఇతర గుడుల శిఖరాలు బోట్లకు తగిలే ప్రమాదం ఉంటుందని సూచించారు. కృష్ణానది బ్యాక్ వాటర్ లెవెల్ ప్రస్తుతం 857అడుగుల ఎత్తులో ఉంది. నీటిమట్టం తగ్గుతున్న క్రమాన్ని బట్టి మరో నెలరోజుల్లో ఆలయం పూర్తిగా తేలే అవకాశం ఉంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.