అక్కంపల్లి రిజర్వాయర్ లో బర్డ్ ఫ్లూ కోళ్ల కలకలం…!

నల్లగొండ జిల్లా
దేవరకొండ

అక్కంపల్లి రిజర్వాయర్ లో బర్డ్ ఫ్లూ కోళ్ల కలకలం…

చనిపోయిన కోళ్లను రిజర్వాయర్ లో పడవేసిన వైనం..

తాగునీటి అవసరాలకు అనుగుణంగా ఆక్కంపల్లి రిజర్వాయర్..

ఆక్కంపల్లి నుండే హైదరాబాద్ జనరల్ నగరాలకు మంచినీటి సరఫరా..

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గుడిపల్లి పోలీసులు..

నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని అక్కంపల్లి రిజర్వాయర్ లో కోళ్లు ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది. దేవరకొండ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ జంట నగరాలకు అక్కంపల్లి రిజర్వాయర్ నుండే తాగునీటి సరఫరా చేస్తున్నారు. తాగునీటి అవసరాలకు అనుగుణంగా ఉన్న అక్కంపల్లి రిజర్వాయర్ లో చనిపోయిన కోళ్లు ప్రత్యక్షం కావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు రిజర్వాయర్లో కోళ్లను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వివరాలు సేకరించిన పోలీసులు వద్దిపట్ల కు చెందిన ఓ కోళ్ల ఫామ్ నిర్వాహకులు బర్డ్ ఫ్లూ తో కోళ్లు చనిపోతున్నాయని రాత్రికి రాత్రి కోళ్లను తెచ్చి రిజర్వాయర్లో పడవేసినట్లు కనుగొన్నారు. దేవరకొండ ఆర్డిఓ తో పాటు పెద్దఅడిశర్లపల్లి మండల రెవిన్యూ, వెటర్నరీ సిబ్బంది గుడిపల్లి పోలీసులతో కలిసి రిజర్వాయర్ ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. స్థానికులను వివరాలను ఆడిగి తెలుసుకున్నారు. గుడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..