తెలంగాణలో రెండు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించారు. మరోవైపు నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
నల్గొండ ,ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో పిఆర్టియూ అభ్యర్థి పింగిళి శ్రీపాల్ రెడ్డి విజయం..
8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టారు. అయితే రెండు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించారు. ఈ ఎన్నికలో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే మల్క కొమురయ్య గెలుపొందం గమనార్హం. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పోలైన ఓట్లలో 24,144 ఓట్లు చెల్లుబాటు కాగా, 897 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు. గెలుపు కోటా ఓట్లు 12,073గా నిర్దారించారు. అయితే బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959 మొదటి ప్రాధాన్యత ఓట్లు రావడంతో ఆయనను విజేతగా ప్రకటించారు. ఈ స్థానం నుంచి బరిలో నిలిచిన వంగ మహేందర్ రెడ్డికి 7,182, అశోక్ కుమార్‌కు 2,621, కూర రఘోత్తం రెడ్డికి 428 ఓట్లు వచ్చాయి.
TEACHERS MLC ELECTIONS RESULTS 2025.
మరోవైపు నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇక్కడ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ గెలుపు కోటాకు సరిపడ ఓట్లు రాలేదు. దీంతో ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టగా.. రెండో ప్రాధాన్యత ఓట్లతో సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ స్థానంలో నర్సిరెడ్డి రెండో స్థానంలో, మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్, నాలుగో స్థానంలో మరో స్వతంత్ర అభ్యర్థి పూలరవీందర్, ఐదో స్థానంలో బీజేపీ అభ్యర్థి సరోత్తమ్‌రెడ్డి నిలిచారు.
ఇదిలాఉంటే, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-m గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కరీంనగర్లో ఈ ఓట్లు లెక్కింపు చేపడుతున్నారు. ఇప్పటి వరకు కేవలం లక్ష ఓట్లు మాత్రమే ప్రాథమిక లెక్కింపు జరిగింది. అందులో 8,000 ఓట్లను చెల్లనివిగా అధికారులు గుర్తించారు. మరో 1,50,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ పోరు ఫలితాలు వెలువడ్డాయి. నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీగా మల్లా కొమురయ్య గెలుపొందారు.
నల్గొండలోని వేర్‌హౌసింగ్ గోదాములో జరిగిన కౌంటింగ్‌లో శ్రీపాల్ రెడ్డి తన ప్రత్యర్థులైన అలుగుబెల్లి నర్సిరెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డిపై విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో అధికారులు ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 24,139 మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఇవాళ ఉదయం ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్ ప్రక్రియ రాత్రి 9 గంటలకు ముగిసింది. మొత్తం 25 టేబుళ్లలో కౌంటింగ్ నిర్వహించారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 25,041 ఓట్లు పోలవ్వగా.. అందులో 897 ఓట్లు చెల్లుబాటు కాలేదు. మొత్తం చెల్లుబాటు అయిన 24,144 ఓట్లలో బీజేపీ అభ్యర్థి కొమురయ్యకు 12,959 ఓట్లు వచ్చాయి. ఇక పీఆర్టీయూ అభ్యర్థి మహేందర్ రెడ్డి 7,182 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇక అశోక్ కుమార్‌కు 2,621 ఓట్లు వచ్చాయి.
ఇక అధికార పార్టీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి, రేవంత్ రెడ్డి సన్నిహితుడు గాల్‌రెడ్డి హర్షవర్దన్ రెడ్డి మూడో స్థానానికే పరిమితమయ్యాడు. అలుగుబెల్లి నర్సిరెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కోదండరామ్‌కు భారీ షాక్ తగిలింది. ఆయన బలపరిచిన పన్నాల గోపాల్‌రెడ్డికి కేవలం 24 ఓట్లు మాత్రమే వచ్చాయి.