సోనియా బుక్‌లో తెలంగాణ ప్రస్తావన ఏది ?
నేను 8వేల ఎకరాల భూములు ఆక్రమించానన్నారు.. 2 నెలలైనా నిరూపించలేకపోయారు.
కనీసం 8 గజాల భూమిని ఆక్రమించినట్లు కూడా రేవంత్ ఆధారాలు చూపించలేకపోయారు..
సోనియాకి తెలంగాణపై ప్రేమ ఉంటే.. ఆమె ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదు?
తెలంగాణ ఇచ్చింది సోనియమ్మేనని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు.. సమాధానం చెప్పాలి
తెలంగాణ సోనియా దయాభిక్ష కాదు, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఉద్యమం
కాంగ్రెస్ పాలనలో సాధించింది శూన్యం.. రంగుల కల చూపించి ప్రజలను మోసం చేశారు
రూ. 4.5 లక్షల కోట్లు అప్పులు చేసి.. భూములను అమ్ముతున్నారు.. తనఖా పెడుతున్నారు
గాంధీ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి బాడీగార్డ్‌లా వ్యవహరిస్తున్నారు
భారత్ సమ్మిట్‌కు కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం అవసరమా? రూ. 100 కోట్ల ఖర్చు అవసరమా?
కరువులో కొడంగల్‌కు రూ. 9 వేల కోట్లు అవసరమా? రాష్ట్రంలో కొడంగల్ ఒక్కటే ఉందా?
250 టీఎంసీల నీళ్లు కృష్ణా నదిలో ఉన్నాయి.. రేవంత్ ఎందుకు పంపులు ఆన్ చేయడం లేదు?
70 కిమీ దగ్గర్లో ఉన్న పాలమూరుకు నీళ్లు రావు.. మరి నీళ్లు ఆంధ్రాకు ఎందుకు పోతున్నాయి?..
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్..
రాష్ట్రంలో నీళ్లు లేక కరువుతో ప్రజలు అల్లాడుతుంటే భారత్ సమ్మిట్‌కు కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకోవడం అవసరమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు పాలకులు తెచ్చిన వికృతి కరువు అని మండిపడ్డారు.
కరువులో 9 వేల కోట్లు కొడంగల్‌కు పెట్టడం అవసరమా? రాష్ట్రంలో కొడంగల్ ఒక్కటే ఉందా? అని ప్రశ్నించారు. 250 టీఎంసీల నీళ్లు కృష్ణా నదిలో ఉన్నాయి. ఎందుకు పంపులు ఆన్ చేయడం లేదన్నారు..