తిరుమల తిరుపతి దేవస్థాన సంగీత విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ 76 మృతి చెందారు. తిరుపతిలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో ఈరోజు ఉదయం మృతి చెందారు.
ఈయన వెయ్యికి పైగా అన్నమాచార్య సంకీర్త నలకు స్వర కల్పన చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం లో 1978 నుంచి 2006 వరకు గరిమెళ్ల ఆస్థాన గాయకుడిగా ఉన్నారు.
గరిమెళ్ల బాలకృష్ణ వినరో భాగ్యము విష్ణు కథ, జగడపు చనువుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు వంటి సుప్రసిద్ధ కీర్తనలకు స్వరాలు సమకూర్చారు.
అంతేకాదు సంప్రదాయ కర్ణాటక సంగీతంలో లలిత సంగీతంలో జానపద సంగీతంలోనూ పాట పాడారు. ఈయన భౌతిక దేహానికి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి,నివాళులర్పించారు. నేటి తరానికి అన్నమయ్య కీర్తనలు అందించిన మహానుభావుడు అన్నారు.