న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం…. మూడోసారి ఐసీసీ చాంపియన్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత్..!

టీమిండియా చరిత్ర సృష్టించింది. పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఓడించి సగర్వంగా ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలో వరుసగా రెండో ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. కోట్లాది మంది అభిమానులను మురిపించింది..

India beat New Zealand by 4 four wickets to win Champions Trophy 2025..

దుబాయ్‌ వేదికగా ఆదివారం జరిగిన ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్స్‌లో 252 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిత 50 ఓవర్లలో మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో టీం ఇండియా చేదించింది. ఆరు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. 252 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ ఇండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ తొలి వికెట్‌ భాగస్వామ్యానికి 105 పరుగులు జత చేశారు..105 పరుగుల వద్ద మిచెల్‌ శాంత్నర్ బౌలింగ్‌లో ఫిలిప్స్‌కు శుభ్‌మన్‌ గిల్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. వన్ డౌన్ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన విరాట్‌ కోహ్లీ.. బ్రేస్‌వాల్‌ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ కావడంతో క్రీజ్‌ను వదిలేశాడు. తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి రోహిత్‌ శర్మ జట్టు స్కోర్‌ చకచకా పెంచడానికి ప్రయత్నించారు. ఈ తరుణంలో 122 పరుగుల వద్ద రోహిత్‌ శర్మ ఔట్‌ కావడంతో టీమ్‌ ఇండియా మూడు వికెట్లు కోల్పోయింది. శ్రేయాస్‌ అయ్యర్‌, అక్షర్ పటేల్‌ నెమ్మదిగా ఆడుతూ స్కోర్ పెంచడానికి ప్రయత్నించారు. కానీ 48 పరుగులతో శ్రేయాస్ అయ్యర్‌, 29 పరుగులతో అక్షర్ పటేల్‌ వెంటవెంటనే ఔటయ్యారు.

ఈ దశలో హార్దిక్ పాండ్యా వచ్చి మెరుపులు మెరిపించి 18 బంతుల్లో 18 పరుగులు చేసి జేమ్సియన్ బౌలింగ్‌లో ఆయనకే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి కేఎల్‌ రాహుల్‌ నెమ్మదిగా ఆడుతూ వీలు చిక్కినప్పుడు షాట్లు కొడుతూ జట్టు విజయ తీరాలకు చేర్చారు. 49వ ఓవర్‌ చివరి బంతిని ఫోర్‌గా మలిచి కేఎల్‌ రాహుల్‌ టీమ్‌ ఇండియాను గెలిపించాడు. ఆరు వికెట్లు కోల్పోయి టీమ్‌ ఇండియా 254 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో మిచెల్‌ బ్రేస్‌వెల్‌, మిచెల్‌ శాంత్నర్ రెండేసి వికెట్లు, కేల్‌ జమియ్సన్‌, రచిన్‌ రవీంద్ర చెరో వికెట్‌ తీశారు…

తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసి, ఫైనల్ పోరులో సత్తా చాటాడు. శుభ్‌మాన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్, పరుగుల వేటలో భారత్‌కు గట్టి పునాది వేశాడు.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు సాధించింది. డారిల్ మిచెల్ 63 పరుగులు చేయగా, ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ 40 బంతుల్లో 53 పరుగులు చేశాడు.

దీనికి ప్రతిస్పందనగా, భారత జట్టు తమ ఇన్నింగ్స్‌ను వేగంగా ఆరంభించింది. రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ కివీస్ బౌలర్లను అత్యంత చాకచక్యంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రోహిత్ న్యూజిలాండ్ పేసర్లను ఎదుర్కొని, మైదానంలోని అన్ని ప్రాంతాలకు బంతిని తరలించాడు. చివరికి అతను అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించాడు. వన్డేల్లో న్యూజిలాండ్‌పై యాభైకి పైగా స్కోర్‌లలో ఎంఎస్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు.

ఇది వన్డే క్రికెట్‌లో కివీస్‌పై రోహిత్ చేసిన 8 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు. తద్వారా, అతను ఎంఎస్ ధోని రికార్డును అధిగమించాడు. ఎందుకంటే భారత మాజీ కెప్టెన్ న్యూజిలాండ్‌పై 7సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు…రోహిత్ తుఫాన్ బ్యాటింగ్, శుభ్‌మాన్ గిల్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియాకు వేగవంతమైన ఆరంభం వచ్చింది. ఈ వార్త రాసే సమయానికి, మెన్ ఇన్ బ్లూ 17 ఓవర్లకు 100 పరుగులు చేసింది. రోహిత్ 68, గిల్ 27 పరుగులతో నిలిచారు.