BRS రజతోత్సవ సభకు స్వచ్చందంగా ఆటో డ్రైవర్ల విరాళాలు..!

*సూర్యాపేట జిల్లా..*

BRS రజతోత్సవ సభకు స్వచ్చందంగా విరాళాలు..

మొన్న విశ్రాంత ఉద్యోగి.. నేడు ఆటో డ్రైవర్ల ఆర్థిక సాయం..

ఆర్థిక ఇబ్బందులున్నా.. BRS 25 ఏండ్ల పండుగలో మేముసైతం బాగస్వాములవుతామంటున్న సూర్యాపేట ఆటో డ్రైవర్లు..

BRS పార్టీ రజతోత్సవ వేడుకకు తమవంతు రూ.10,116లు అందజేత..

స్థానిక క్యాంపు కార్యాలయంలో మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి కి చెక్కు అందజేసిన ఆటో డ్రైవర్లు..

బిఆర్ఎస్ ప్రభుత్వం హయంలోనే ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగిందని కొనియాడిన ఆటో డ్రైవర్లు..

బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగిందని బి ఆర్ టి యు ఆటో యూనియన్ అధ్యక్షులు కుర్రి సైదులు అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈనెల 27వ తారీకు వరంగల్ లో జరిగే బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు 10116/-రూపాయల చెక్కును మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ప్రమాదంలో చనిపోతే బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆటో యూనియన్లకు 5 లక్షల ప్రమాద బీమా వచ్చేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు లక్షల ప్రమాద బీమా రావడం లేదని, ఐదు లక్షల ప్రమాద బీమా రెన్యువల్ చేయడం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో ఫ్రీ బస్సు అని పెట్టి ఆటో కార్మికుల కడుపు కొట్టారని అన్నారు. మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఈనెల 27న భారీ బహిరంగ సభకు తరలి వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు వై వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బిఆర్ టియు ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అహ్మద్, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు సిహెచ్ వెంకన్న, ప్రధాన కార్యదర్శి ఎస్కె జాన్ పాషా, జిల్లా ఉపాధ్యక్షులు గూండా వెంకన్న, తండు శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ముదిరాజ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పేరుమళ్ళ లింగయ్య, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్, గుణగంటి వెంకన్న, నరసయ్య, పబ్బు వెంకన్న, పాండు, ఎస్.కె గౌస్ పాష, బొమ్మగాని కృష్ణ, దుర్గం అంజి, తదితరులు పాల్గొన్నారు..