బీఆర్ఎస్ మహిళా నేతలకు కేసీఆర్ గుడ్న్యూస్
బీఆర్ఎస్ మహిళా నేతలకు కేసీఆర్ గుడ్న్యూస్
తెలంగాణ : బీఆర్ఎస్ అధినేత బీఆర్ఎస్ మహిళలకు గుడ్న్యూస్ చెప్పారు. ఎర్రవెల్లిలోని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో మహిళా బిల్లు రాబోతుందని, ఆ బిల్లుతో మహిళలకు 33 శాతం సీట్లు వస్తాయని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళలు ఉత్సాహంగా పనిచేయాలని, రాజకీయాల్లో ప్రత్యక్షంగా తిరిగే మహిళలకే అవకాశాలు వస్తాయన్నారు. ఇప్పటి నుంచి ప్రజల్లో ఉండాలంటూ సూచించారు. మహిళా బిల్లు వచ్చాక.. రాష్ట్రంలో 33 శాతం సీట్లు మహిళలకే కేటాయిస్తానని హామీ ఇచ్చారు.