కేసీఆర్ కు జై అంటూనే బీఆర్ఎస్ పార్టీకి మాత్రం దూరం… MLC కవిత..

ఎమ్మెల్సీ కవిత రోజు రోజుకూ దూకుడు పెంచుతున్నారు. కేసీఆర్ కు జై అంటూనే బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఆమె దూరం జరుగుతున్నారు…ఈ రోజు తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత జాతీయ జెండాతో పాటు జాగృతి జెండాను ఆవిష్కరించారు..వేడుకల అనంతరం జై తెలంగాణ, జై జాగృతి, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేసిన కవిత బీఆర్ఎస్ పార్టీ పేరు మాత్రం ఎత్తలేదు. దీంతో కావాలనే ఆమె బీఆర్ఎస్ పార్టీ పేరు పలకలేదన్న చర్చ సాగుతోంది. ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. కొత్త పార్టీ పెట్టేందుకు కవిత సిద్ధమవుతున్నారన్న వార్తలకు ఇది సంకేతమన్న విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి…