రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విక్టరీ సంబరాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చిన్నస్వామి స్టేడియంలో విక్టరీ సంబరాల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు. పాసులు లేని వాళ్లు కూడా రావడం వల్ల క్రౌడ్ పెరిగింది. ఈ క్రమంలో స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పదకొండు మంది మరణించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
17 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో ఆర్సీబీ ఛాంపియన్గా నిలవడం వల్ల ఈ విక్టరీని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయాలని ఫ్రాంచైజీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే బెంగళూరు నగరంలో బస్ పరేడ్ ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్కి ప్రీ పాసులు అందించనున్నట్లు మేనేజ్మెంట్ సోషల్ మీడియాలో పేర్కొంది..ఈ క్రమంలోనే పాసులు లేని అభిమానులు కూడా భారీ ఎత్తున స్టేడియానికి తరలి వచ్చారు. భద్రతా బలగాలు ఉన్నప్పటికీ క్రౌడ్ ఎక్కువవ్వడం వల్ల పరిస్థితి కంట్రోల్ తప్పింది. గేట్ నెం18 వద్ద తొక్కిసలాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అయినప్పటికీ ఈ ఘటనలో పదకొండు మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు..
చూస్తే బాదేస్తోంది..డిప్యూటీ సీఎం క్షమాపణలు…!
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. బాధితులు త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ..ఆర్సీబీ అభిమానులతో బెంగళూరు నగర వీధులు, చినస్వామి స్టేడియం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోవడంపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. అభిమానుల రద్దీ నియంత్రించలేని స్థాయిలో ఉందని విచారం వ్యక్తం చేశారు. విపరీతమైన రద్దీ పరిస్థితులకు తాను నగర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. 5,000 మందికిపైగా పోలీసులు, అధికారులను విధుల్లో మోహరించామని తెలిపారు. యువత పెద్ద సంఖ్యలో తరలి వచ్చారని, యువతపై తమ ప్రభుత్వం లాఠీని ప్రయోగించబోదని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్సీబీ విజయం పట్ల గర్వంగా ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు…
గోడలు దూకి స్టేడియంలోకి..
ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన ఆర్సీబీ జట్టుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. అభిమానుల కోసం స్టేడియం వరకు విక్టరీ పరేడ్ చేపట్టాలని ఆర్సీబీ టీమ్ నిర్ణయించింది. ఈ నైపథ్యంలో అభిమానులు భారీగా పోటెత్తారు. చాలామంది అభిమానులు గోడలు దూకి స్టేడియంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. స్టేడియం వెలుపల ఉండే గోడలు, ఇనుప కంచెలు ఎక్కి స్టేడియంలోకి ప్రవేశించేందుకు చాలామంది ఫ్యాన్స్ ప్రయత్నించారు. అలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలంటూ పోలీసులు విన్నవించినా పెడచెవినపెట్టారు. స్టేడియం పరిసరాలను వీడి వెళ్లాలని కోరినా పట్టించుకోకపోవడంతో రద్దీ మరింత పెరిగిపో ఈ తీవ్ర విషాదానికి దారితీసింది.