పంచాంగం.
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 05 – 06 – 2025,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
గ్రీష్మ ఋతువు,
జ్యేష్ఠ మాసం,
శుక్ల పక్షం,
తిథి : *దశమి* తె3.09 వరకు,
నక్షత్రం : *ఉత్తర* ఉ5.34 వరకు,
తదుపరి హస్త
యోగం : *సిద్ధి* ఉ11.16 వరకు,
కరణం : *తైతుల* మ2.27 వరకు,
తదుపరి *గరజి* తె3.09 వరకు,
వర్జ్యం : *మ2.42 – 4.26,*
దుర్ముహూర్తము : *ఉ9.47 – 10.39,*
మరల *మ2.59 – 3.51,*
అమృతకాలం : *రా1.08 – 2.52,*
రాహుకాలం : *మ1.30 – 3.00,*
యమగండం : *ఉ6.00 – 7.30,*
సూర్యరాశి : వృషభం,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 5.28,
సూర్యాస్తమయం: 6.27,
*_నేటి విశేషం_*
*జ్యేష్ఠశుద్ధ దశమి – దశపాపహరాదశమి / గంగావిర్భావదినం.*
ఈరోజు సమీప నదిలో గంగాస్మరణతో స్నానం చేయాలి.
నది లభ్యం కానప్పుడు వాపీకూప తటాకాదులు వేటిలోనైనా, లేదా ఇంట్లో స్నానం చేసేటప్పుడైనా గంగా నామస్మరణ చేయాలి.
నందినీ నళినీ సీతా మాలినీ చ మహాపగా!
విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపథ గామినీ!!
భాగీరథీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ
ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే!
స్నానకాలే పఠేన్నిత్యం మహాపాత నాశనమ్!!
_ఈ పన్నెండు నామాలతో గంగను స్మరించితే పాప హరణం._
గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానామ్ శతైరపి
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి!!
అంబ త్వద్దర్శనాన్ముక్తిః న జానే స్నానజం ఫలం!
స్వర్గారోహణ సోపానే మహాపుణ్య తరంగిణి!!
విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవమ్
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్!!
అతి తీక్ష్ణ మహాకాయ కల్పాంత దహనోపమ
భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి!!
త్వం రాజా సర్వ తీర్థానాం త్వమేవ జగతః పితా
యాచితో దేహి మే తీర్థం సర్వ పాపాపనుత్తయే!!
యోsసౌ సర్వగతో విష్ణుః చిత్స్వరూపీ జనార్దనః
స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః!!
*_🔆శుభమస్తు🔆_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏