లాస్ ఏంజెలెస్ లో నిరసనలు…నిరసనకారులను తీవ్రంగా హెచ్చరించిన అధ్యక్షుడు ట్రంప్…!

లాస్ ఏంజెలెస్ లో నిరసనలు తీవ్రమౌతున్నాయి. ఫెడరల్ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలు అక్కడ ఉద్రిక్తతలకు దారి తీశాయి. తనీఖీలను అడ్డుకోవడానికి స్థానికులు ప్రయత్నించారు..వందల మంది ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రెండు రోజులైనా పరిస్థితాి అదుపులోకి రాకపోవడంతో అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నారు. 2 వేల మంది నేషనల్ గార్డ్ సైనికులను అక్కడ మోహరించారు. ఈ విషయమై నిరసనకారులను ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌, లాస్‌ ఏంజెలెస్‌ మేయర్‌ కరెన్‌ బాస్‌ తమ బాధ్యతలను నిర్వర్తించలేరు. అందుకే ఫెడరల్ ప్రభుత్వం జోక్యం చేసుకుందని అన్నారు. ఆందోళనకారులు, దోపిడీదారుల సమస్యల్లా పరిష్కరిస్తామని చెప్పారు..లాస్ ఏంజెలెస్ లో వరుసగా రెండో రోజు కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. లాస్‌ ఏంజెలెస్‌లో మొత్తం 44 మంది అక్రమ వలసదారులతో సహా తమను అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఫెడరల్‌ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో 118 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సర్వీస్‌ ఎంప్లాయిస్‌ ఇంటర్నేషనల్ యూనియన్..కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్‌ హుయెర్టాను అరెస్టు చేశారు. దీంతో అక్కడ నిరసనలు చెలరేగాయి. వందల మంది ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. హుయెర్టాను విడుదల చేయాలంటూ ఫెడరల్ భవనం ముట్టడించారు. దీంతో పోలీసులు కూడా రంగంలోకి దిగి లాఠీలు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇప్పుడు ట్రంప్ ఏకంగా 2వేల మంది భద్రతా సిబ్బందిని లాస్ ఏంజెలెస్ లో మోహరించారు…

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) నిరసనకారులను తీవ్రంగా హెచ్చరించారు.

ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌ వేదికగా ఒక పోస్టు పెట్టారు. అందులో ‘కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌, లాస్‌ ఏంజెలెస్‌ మేయర్‌ కరెన్‌ బాస్‌ తమ బాధ్యతలను నిర్వర్తించలేరు. ఈ విషయం అందరికీ తెలుసు. అప్పుడు ఫెడరల్‌ ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తుంది. ఆందోళనకారులు, దోపిడీదారుల సమస్య వలే పరిష్కరిస్తాం’ అని అధ్యక్షుడు రాసుకొచ్చారు. లాస్‌ ఏంజెలెస్‌ ఘటనను వైట్‌హౌస్‌ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ స్టీఫెన్‌ మిల్లర్‌ తీవ్రంగా ఖండించారు. ఇవి యూఎస్‌ చట్టాలకు, సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులను బహిష్కరిస్తుందని ఉద్ఘాటించారు. కాగా.. రెండోరోజు కూడా ఆందోళనలు కొనసాగాయి…
లాస్‌ ఏంజెలెస్‌లో మొత్తం 44 మంది అక్రమ వలసదారులతో సహా తమను అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఫెడరల్‌ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే అక్కడ నిరసనలు చెలరేగాయి. వందలమంది ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి వారిని చెదరగొట్టారు. సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయెర్టాను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆందోళనకారులు ఫెడరల్‌ భవనం వెలుపలకు చేరుకొని ఆయనను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వారిని అడ్డుకునేందుకు ఫెడరల్‌ అధికారులు పెప్పర్‌ స్ప్రేను ప్రయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమ వలసదారులను దేశం నుంచి పంపడానికి అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే వారిని అరెస్ట్‌ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు..