🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🔆పంచాంగం🔆
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 17 – 07 – 2025,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
గ్రీష్మ ఋతువు,
ఆషాఢ మాసం,
బహుళ పక్షం,
తిథి : *సప్తమి* సా6.15 వరకు,
నక్షత్రం : *రేవతి* తె3.30 వరకు,
యోగం : *అతిగండ* ఉ10.17 వరకు,
కరణం : *భద్ర* ఉ7.20 వరకు,
తదుపరి *బవ* సా6.15 వరకు,
ఆ తదుపరి *బాలువ* తె5.05 వరకు,
వర్జ్యం : *సా4.13 – 5.44*
దుర్ముహూర్తము : *ఉ9.56 – 10.47,*
తదుపరి *మ3.06 – 3.58,*
అమృతకాలం : *రా1.15 – 2.45,*
రాహుకాలం : *మ1.30 – 3.00,*
యమగండం : *ఉ6.00 – 7.30,*
సూర్యరాశి : కర్కాటకం,
చంద్రరాశి : మీనం,
సూర్యోదయం : 5.37,
సూర్యాస్తమయం: 6.34,
*_నేటిమాట_*
*ధ్యానం – ఎలా చేయాలి???*
_ధ్యానప్రయత్నంలో మనసు తరచుగా ఘర్షణకు గురవుతుంది, ధ్యానం సాగటంలేదు !?”_
ఒకనది ఒడ్డున కూర్చొని ధ్యానంకోసం ప్రయత్నిస్తున్న ఒకవ్యక్తి అప్పటికే అక్కడున్న చల్లని వాతావరణాన్ని, పిల్లగాలిని ఆస్వాదిస్తూ సాధన చేస్తుంటాడు.
ఇంతలోనే పక్కనుండి ఏదైనా శబ్దం వినిపించినా, ఏదైనా ఆలోచన వచ్చినా వాటిని తన సాధనకు అడ్డు అనుకుంటాడు.
అక్కడి చల్లని వాతావరణాన్ని, పిల్లగాలిని గ్రహించిన ‘ఎరుకే’ శబ్ధాన్ని, ఆలోచనను గ్రహించింది.
గ్రహింపుకు ఆ బేధంలేదు, ఏదైనా గ్రహిస్తుంది, కానీ మనం మాత్రం రెండికి బేధం సృష్టించుకుంటున్నాం, పిల్లగాలి ధ్యానానికి అడ్డుకానప్పుడు పిచ్చిఆలోచన ధ్యానానికి ఎలా అడ్డు అయ్యింది.
అలా అనుకోవటానికి ఒక కారణం ఉంది, మనని ఏవైతే ప్రభావితం చేయటంలేదో వాటిని అడ్డుగా భావించటంలేదు.
కానీ ఏవైతే మనని ప్రభావితం చేస్తున్నాయో వాటిని అడ్డు అనుకుంటునాం.
అలా అడ్డుకునేవాటిని రాకుండా చేయాలని ప్రయత్నం మొదలుపెడుతున్నాం,
వాటిని బలవంతంగా ఆపుకునే లేదా నెట్టేసే ప్రయత్నం చేస్తాం,
అప్పుడు ధ్యానప్రయత్నం కాస్తా తిరస్కరణ ప్రక్రియగా మరి మనసుకు ఘర్షణ మొదలవుతుంది.
మనం ఏ విషయమైతో వద్దనుకుంటున్నామో దానికన్నా దానిపట్ల మన తిరస్కరణే ధ్యానానికి పెద్ద అడ్డుగా మారిపోతుంది !
*_🔆శుభమస్తు🔆_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏