వీఆర్వో ఆత్మహత్యాయత్నం..

వీఆర్వో ఆత్మహత్యాయత్నం..!

ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట మండల రెవెన్యూ తహశీల్దార్ మనోహర్ వేధింపులతో అన్నవరం వీఆర్వో వరలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు..!!?.
తాసిల్దార్ మనోహర్ అన్నవరం మరియు త్రిపురవరం గ్రామ పరిధిలో ఉన్న అసైన్ భూములకు పాసుపుస్తకాలను నిబంధనలకు విరుద్ధంగా జారీ చేయాలని ఆదేశించడం, రెవెన్యూ పరమైన కార్యకలాపాలను సక్రమంగా వివరించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ జులుం ప్రదర్శిస్తున్నారని పలువురు ఆరోపించారు.

గత నాలుగైదు మాసాల నుండి తాసిల్దార్ మనోహర్ వేధింపులు పెరగడంతో తట్టుకోలేక వీఆర్వో వరలక్ష్మి క్రిమిసంహారక మందును తాగి చనిపోయేందుకు ప్రయత్నం చేశారు.

ఆత్మహత్యకు పాల్పడిన వరలక్ష్మీ ముందుగా తాసిల్దార్ మనోహర్ వేధింపుల వలన నేను సరిపోతున్నానని ఆడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది.

ఈ సమాచారం తెలుసుకున్న పలువురు గ్రామ శివారులో అపస్మారక స్థితిలో ఉన్న వరలక్ష్మిని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే వరలక్ష్మి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో విజయవాడకు మెరుగైన వైద్యం కోసం తరలించారు. మనోహర్ పరారీలో ఉన్నట్లు సమాచారం..!