ఈ నెల 25న అల్పపీడనం..

*ఈ నెల 25న అల్పపీడనం*

బంగాళాఖాతంలో ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.

వాయవ్య బంగాళాఖాతంలోని ఒడిశా-ప.బెంగాల్ తీరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది.

దీని ప్రభావంతో 26, 27 తేదీల్లో ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖఫట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.