ప్రొ కబడ్డీ చీఫ్ గెస్ట్గా వైభవ్…

2025 ప్రొ కబడ్డీ సీజన్ 12 ఘనంగా ప్రారంభమైంది. విశాఖపట్టణం వేదికగా తొలి అంచె పోటీలు జరగనున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం గ్రాండ్గా ఓపెనింగ్ సెర్మనీ జరిగింది. ఈ సెలబ్రేషన్స్కు ఐపీఎల్ సంచలనం 14ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రమే వచ్చిన వైభవ్కు, నిర్వహకులు ఘన స్వాగతం పలికారు.

ఐపీఎల్లో వైభవ్ సంచలనం
2025 ఐపీఎల్లో వైభవ్‌ సూర్యవంశీ అరంగేట్రం చేశాడు. 14ఏళ్ల 23 రోజులకే ఐపీఎల్లో డెబ్యూ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో అతిపిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఈ బిహారీ ప్లేయర్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ బాది ఆశ్చర్యపర్చాడు. దీంతోనే ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన, అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు..

కబడ్డీ మ్యాట్ పై క్రికెట్.

అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు వైభవ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. అందరి చూపును 14ఏళ్ల వైభవ్ ఆకర్షించాడు. ఈ క్రమంలోనే కబడ్డీ మ్యాట్పై బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత ప్లేయర్స్తో కలిసి సరదాగా కాసేపు కబడ్డీ కూడా ఆడి ఆకట్టుకున్నాడు. అనంతరం వైభవ్‌ సూర్యవంశీ చేతుల మీదుగా ఈవెంట్‌ ప్రారంభం అయ్యింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి..