అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం హమాస్ గ్రూప్‌నకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. గాజా యుద్ధం ముగింపు కోసం తాను ప్రతిపాదించిన ఒప్పందానికి ఆదివారంలోపు అంగీకారం తెలపాని సూచించారు. లేకుంటే హమాస్‌కు నరకం చూపిస్తానని తీవ్రంగా హెచ్చరించారు..చాలా ఏళ్లుగా మధ్యప్రాచ్యంలో క్రూరమైన, హింసాత్మక ముప్పుగా హమాస్ ఉంది. వారు అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో మారణహోం సృష్టించారు. శిశువులు, పిల్లలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు ఇలా ఎవరినీ విడిచిపెట్టకుండా చాలా మందిని చంపారు. మరెంతో మంది జీవితాలను భరించలేనంత దుర్భరంగా మార్చారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటికే 25వేలకుపైగా హమాస్ సైనికులు చనిపోయారు. మిగిలిన వారు కూడా ఇజ్రాయెల్ సైన్యం మధ్యలో చిక్కుకున్నారు. వారి జీవితాలు కూడా త్వరలో ఆరిపోయేలా ఉన్నాయి. నేను కేవలం ‘గో’ అని అంటే చాలు. మీ అంతం ఖాయం. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, ఎవరెవరు ఉన్నారో మాకు తెలుసు. మీరు కచ్చితంగా వేటాడబడతారు. చంపబడతారు. అమాయక పాలస్తీనియన్లు అందరూ గాజాలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని నేను కోరుతున్నాను. అయితేన నేను హమాస్ కోసం ఒక చివరి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను. మధ్యప్రాచ్యంలోని చాలా శక్తివంతమైన దేశాలు, ధనిక దేశాలు గాజా యుద్ధం ముగింపు కోసం నేను ప్రతిపాదించిన ఒప్పందానికి అంగీకరించాయి. కనుక హమాస్ కూడా దీనికి అంగీకరించాలి. దీని వల్ల మిగిలిన హమాస్ యోధులైనా కనీసం బతుకుతారు. ప్రతిపాదిత ఒప్పందంలోని వివరాలు ప్రపంచం మొత్తానికి తెలుసు. దీనికి అంగీకరిస్తే మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొంటుంది. హింస, రక్తపాతం ఆగుతుంది. అంతేకాదు చనిపోయినవారి మృతదేహాలతో పాటు, బందీలు అందరూ విడుదల అవుతారు. అందుకే ఈ ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు హమాస్‌కు సమయం ఇస్తున్నా. ఈ గడువులోగా హమాస్ ఒప్పందానికి అంగీకరించాలి. ఒక వేళ పొరపాటున ఈ ఒప్పందం కుదరకపోతే, ఇంతకు ముందు ఎవరూ కనీవిని చూడని విధంగా, హమాస్‌కు నరకం చూపిస్తా. ధన్యవాదాలు! అన్నారు..
నోబెల్ కోసమేనా, కొత్త డ్రామా.?
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైనప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పలుమార్లు బహిరంగంగానే అడుగుతున్నారు. అయితే ట్రంప్ నోబెల్ కోసం పరితపించడంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ సెటైర్లు కూడా వేశారు. నోబెల్ శాంతి బహుమతి కావాలంటే ముందు ఇజ్రాయెల్‌ను కట్టడి చేయాలన్నారు. గాజా యుద్ధాన్ని ఆపితేనే నోబెల్ సాధ్యమని తేల్చి చెప్పారు. మరోవైపు ఈ నెల 10న నోబెల్ శాంతి బహుమతి ప్రకటించనున్నారు. దీనితో ట్రంప్‌లో టెన్షన్ పెరిగిపోతోంది. అందుకే గాజాపై అత్యవసరంగా సంధి ప్రతిపాదనలు సిద్ధం చేయించి ఇజ్రాయెల్, అరబ్ దేశాలతో ఆమోదముద్ర వేయించారు. మరోవైపు ట్రంప్ కార్యవర్గం శాంతి బహుమతి కోసం లాబీయింగ్ వేగవంతం చేసింది. ఈలోపే ట్రంప్‌లో ఒత్తిడి పెరిగిపోతోంది. అందుకే తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కకపోతే అమెరికాకే అవమానం అంటూ కొత్త రాగం అందుకొన్నారు. అంటూ పలు దేశాలు ప్రేమతో చేస్తున్నాయి.