ఓ కామాంధుడు.. హాస్పిటల్ మార్చురీలో ఉన్న ఓ మహిళా శవంపై ఓ వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. గతంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటికి రావడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్ట్రెచర్పై ఉన్న మహిళా మృతదేహాన్ని పక్కకు తీసుకెళ్లి మరీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాత సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ హాస్పిటర్ మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
మధ్యప్రదేశ్ బుర్హాన్పూర్ జిల్లాలోని ఖక్నార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మార్చురీలో గతేడాది ఏప్రిల్ 18వ తేదీన పోస్ట్మార్టం కోసం ఒక మహిళ మృతదేహాన్ని తీసుకువచ్చి ఉంచారు. అయితే స్ట్రెచర్పై తీసుకువచ్చిన ఆ మహిళ మృతదేహాన్ని చూసిన ఒక వ్యక్తి పక్కకు లాక్కెళ్లి లైంగిక చర్యకు పాల్పడ్డాడు..
ఆ రోజున సాయంత్రం 6.45 గంటలకు ఈ దారుణం జరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. దీంతో ఏడాది కిందట జరిగిన ఈ సంఘటన తాజాగా బయటపడింది. దీంతో ఆ ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆదియా దావర్ ఈ నెల 7వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మరోవైపు.. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు.. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భౌరాఘాట్ ప్రాంతంలోని తంగియాపట్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల నీలేష్ భిలాలాను నిందితుడిగా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. రిమాండ్ కోసం జైలుకు తరలించారు.
అయితే ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీ గదిలోకి నిందితుడు ఎలా ప్రవేశించాడు అనేది ఇప్పడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. కాగా.. సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది…
https://x.com/anuraag_niebpl/status/1975995588828361041?t=pibYRSFnYVsHbOkvwkPNpA&s=19