🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌸పంచాంగం🌸
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 15 – 11 – 2025,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
కార్తీక మాసం,
బహుళ పక్షం,
తిథి : *ఏకాదశి* తె4.06 వరకు,
నక్షత్రం : *ఉత్తర* రా2.01 వరకు
యోగం : *వైధృతి* ఉ10.11 వరకు
కరణం : *బవ* మ3.50 వరకు
తదుపరి *బాలువ* తె4.06 వరకు,
వర్జ్యం : *ఉ8.28 – 10.08*
దుర్ముహూర్తము : *ఉ6.08 – 7.37*
అమృతకాలం : *సా6.30 – 8.10*
రాహుకాలం : *ఉ9.00 – 10.30*
యమగండం : *మ1.30 – 3.00*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *కన్య*
సూర్యోదయం : *6.08*
సూర్యాస్తమయం : *5.21*
*_నేటి విశేషం_*
*_భగవద్విశ్వాసముంటే జగత్తులో సాధించలేనిది ఏదీ లేదు🌷_*
ఆధ్యాత్మికము అంతగా వంటబట్టని వారు, సాధ్యమైనంతవరకు భగవద్విశ్వాసమును పెంచుకుంటూ రావాలి!!…
భగవద్విశ్వాసమే ఉంటుంటే మనము సాధించలేనిది యీ జగత్తులో యేదీ ఉండదు, అన్నింటిని సాధించవచ్చు.
ఇది మీకు తెలియక పోవచ్చు, కాని ప్రయత్నించండి.
తప్పక ఆ అనుభవము అనుభూతిలో తేలుతుంది, అన్నింటిని నమ్ముతున్నారు, బజారులో పోయేవారు ఎవరు చెప్పినా నమ్ముతున్నారు.
ఏ astrologer చెప్పినా నమ్ముతున్నారు.
క్యాలండరులో ‘యీ పొద్దు ఏకాదశి’ అని చెబుతే దానిని నమ్మి ఏకాదశి వ్రతము చేస్తున్నారు.
ఒక సిద్ధాంతి వచ్చి యీ పొద్దు అమావాస్య అంటే తర్పణాలు విడుస్తున్నారు.
ఇలా అన్నింటిని నమ్ముతున్నారు, కాని, దైవవాక్కు మాత్రం నమ్మటం లేదు.
అదే దురదృష్టము, పవిత్రమైన వేదము, భగవత్ శ్వాసయైన వేదము, ఋషులంతా సత్యమార్గములో ఆర్జించిన వేదము ‘తత్త్వమసి’ ‘అదే నీవు నాయనా!’ అని బోధిస్తుంటే ‘అది నేనెట్లా అవుతాను?’ అని ఉల్లఘించి పోతున్నారు.
ఈ అన్నింటిని నమ్ముతున్నాడు దేనికోసం? స్వార్ధంకోసం నమ్ముతున్నాడు.
దైవవాక్కు నిస్వార్ధమైనది, ఒక astrologer వచ్చి చేయి పట్టుకొని యీ గీతవలన నీకు గొప్ప విద్యలభిస్తుంది అని చెప్పినప్పుడు అనుకున్నదానికంటె ఒక రూపాయి ఎక్కువ తీసి అతని చేతిలో పెడతారు.
ఇంకొకడు వచ్చి చాలా కీర్తి అనుభవిస్తావు అని ఒక వ్రాత ఉంటున్నాది నీ చేతిలో అని చెపితే యింకో రూపాయి యిచ్చేస్తాడు. నీకు అన్నీ సమృద్ధిగా ఉంటున్నాయని ఎవరైనా చెపితే వానికి పట్టలేనంత ఆనందము కలుగుతుంది.
కానీ అదే సమయంలో మరి యింకొక గీతను చూచి ‘అయ్యా! నీ ఆయుఃప్రమాణము తక్కువగా ఉందంటే’ కృంగిపోతారు, అయిపోయింది.
లైఫ్ దగ్గరకు వచ్చేటప్పటికి కృంగిపోతారు.
ఈ లైఫ్ యేనాటికైనా కృంగక తప్పుతుందా? దినదినమునకు కృంగిపోతూనే ఉంటుంది.
ఒక దినమునందు సూర్యోదయము, సూర్యాస్తమయము, అంతే! యిరవైనాలుగు గంటలు మన లైఫ్ మైనస్ అయిపోయింది.
సత్యమైన మాట చెబుతే వీనికి అసంతృప్తి కలుగుతుంది, అనిత్యము, అసత్యము, అశాశ్వతము అయిన మాటలు చెప్పినప్పుడు పొంగిపోతారు.
సత్యము అంతా జన విరోధముగా కనుపిస్తుంది.
అసత్యం జనరంజకమ్, మద్యమునకు అలవాటుపడిన వ్యక్తి ఊరికి చివర ఎక్కడో అంగడి పెట్టుకొని ఉన్నాగానీ అక్కడకు నడచిపోయి చాలా ఆనందముగా డబ్బిచ్చి తాను తెచ్చుకుంటాడు. కాని, యింటింటికి వచ్చి ‘అమ్మా! పాలు కావలెనా, పెరుగు కావలెనా’ అంటే ‘మాకు వద్దుపో వద్దుపో’ అంటారుట! ఇంటికి వచ్చిన పవిత్రమైన క్షీరమును వద్దంటారు కానీ అపవిత్రమైన, దుష్టమైన, మనసును చంచలము గావించే మద్యపానము కావాలని పరుగెత్తి వెళ్ళి తెచ్చుకుంటారు.
ఈనాటి కలిప్రభావము మానవుని యీరకమైన dance ఆడిస్తున్నాది. యిది ఈనాటినుండే గుర్తించటానికి ప్రయత్నించండి.
ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది క్షేత్రము, ఎవరు క్షేత్రజ్ఞడు తెలుసుకోండి! దేహము కేవలము క్షేత్రము, కానీ, యిందులో ఆత్మయనే క్షేత్రజ్ఞుడు లేకపోతే దేహము కేవలము ఒక జడము.
*_🌸శుభమస్తు🌸_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏