టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే..గిల్ పై వేటు.!

టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు ప్రకటన.

ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభంకానున్న

టీ20 వరల్డ్‌కప్‌
కెప్టెన్‌గా సూర్యకుమార్‌, వైస్‌ కెప్టెన్‌గా అక్షర్
అభిషేక్‌ శర్మ, తిలక్‌వర్మ, హార్దిక్‌ పాండ్యా, దూబే
రింకూసింగ్‌, బుమ్రా, హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్‌
కుల్దీప్‌, వరుణ్‌ చక్రవర్తి, వాషింగ్టన్‌ సుందర్‌
జట్టులో ఇషాన్‌ కిషన్, సంజూ శాంసన్‌కు చోటు
టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో గిల్‌కు దక్కని చోటు
సుదీర్ఘకాలం తర్వాత జట్టులోకి ఇషాన్‌ కిషన్‌
ముస్తాక్‌ అలీ టోర్నమెంట్‌లో రాణించిన ఇషాన్‌

వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ 2026 ప్రపంచకప్ జరగనుంది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి..ఈ మెగాటోర్నీలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యుల గల బృందాన్ని సెలక్టర్లు ఎంపిక చేశారు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనే
భారత జట్టు ఈ మెగాటోర్నీలో బరిలోకి దిగనుంది.

పేలవ ఫామ్‌తో ఇబ్బందులు పడుతున్న శుభ్‌మన్ గిల్ పై వేటు పడింది. దాదాపు ఏడాదిన్నర తరువాత ఇషాన్ కిషన్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు..

టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్‌, రింకూ సింగ్‌, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్‌).