జర్నలిస్టుల అక్రమ అరెస్టులు ఖండిస్తున్నాం..మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ…

హైదరాబాద్‌లో జర్నలిస్టుల అరెస్ట్..!

హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద అక్రిడిటేషన్ కార్డుల కోసం జర్నలిస్టులు చేస్తున్న ధర్నాను అడ్డుకున్న పోలీసులు..

అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు..

ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, మీడియాతో మాట్లాడుతున్న మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ..

జీవో 252 సవరణకు డిమాండ్ చేస్తూ చేపట్టిన శాంతియుత నిరసనకు జర్నలిస్టులు భారీగా తరలివచ్చారు. జీవో సవరణకు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, డెస్క్, కేబుల్, ఇండిపెండెంట్ జర్నలిస్టులు.. జీవో 252లో స్పష్టతలేని నిబంధనలను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. ‘మీడియా అక్రిడిటేషన్ కార్డు–మీడియా కార్డు రెండు కార్డుల విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాటిలైట్, కేబుల్ టీవీ ఛానళ్ల అక్రిడిటేషన్లలో భారీ కోతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు..రిపోర్టర్లు–డెస్క్ జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నమని ఆరోపించారు. పార్ట్‌టైం, ప్రీ లాన్స్, ఇండిపెండెంట్ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయంపై నిరసన గళం విప్పారు. చిన్న పత్రికలు, వెబ్ సైట్,డిజిటల్ మీడియా జర్నలిస్ట్ లకు న్యాయం చేయాలని కోరారు.

గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959