తగ్గిన బంగారం, వెండి ధరలు..!

వరుసగా బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్న వేళ రెండు రోజుల నుండి (Gold), వెండి (Silver) ధరలకు కాస్త బ్రేక్‌ పడింది.. గత మూడు రోజుల్లో బంగారం ధర రూ.3,850 మేర తగ్గింది. అటు వైట్‌ మెటల్‌ కూడా ఒక్కసారిగా పడిపోయింది. ఒక్కరోజే రూ.17 వేల మేర హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,150కి తగ్గింది (Gold Rates). రెండు రోజుల క్రితం ఈ ధర రూ.1.43 లక్షలకు చేరిన విషయం తెలిసిందే. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,850 పలుకుతోంది. ఇక ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన వెండి ధరలు భారీగా పడిపోయాయి. కిలో వెండి ధర ఒక్కరోజే రూ.17,200 తగ్గింది. దీంతో రూ.2.50 లక్షలు దాటిన కిలో వెండి ధర.. తాజా తగ్గింపుతో రూ.2,40,800కి పడిపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 8 శాతం మేర పడిపోయి 72.93 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక ఈ ఏడాది వెండి ధర దాదాపు 138 శాతం పెరిగింది. బంగారం ధర 75 శాతం పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.. ఇది ఇలా ఎన్ని రోజులు కొనసాగుతుందో చెప్పలేము అంటున్నారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959