ఆంధ్ర వాహనాలకు టోల్ గేట్ ఫ్రీ..!
సంక్రాంతికి ఆంధ్రకు వెళ్లే వాహనాలకు టోల్ ఛార్జీలను భరిస్తామని కేంద్రానికి రేవంత్ సర్కార్ లేఖ.
హైదరాబాద్ – విజయవాడ ఎన్హెచ్-65 హైవేని దృష్టిలో పెట్టుకొని టోల్ ఛార్జీల రద్దు ప్రతిపాదన.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్ల ఓట్ల కోసం సంక్రాంతిని టార్గెట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.
దసరాకి బస్సుల్లో డబుల్ ఛార్జీలు.. సంక్రాంతికి కారులో పోతే టోల్ ఛార్జీల రద్దుపై తీవ్ర విమర్శలు..!
తెలంగాణ దసరాకి లేని టోల్ ఛార్జీ రద్దు, ఆంధ్ర సంక్రాంతికి ఎందుకని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్..!
*జనవరి 11 నుంచి 18 వరకు టోల్ ఛార్జీల రద్దుతో, రోజుకి రూ.5 కోట్ల చొప్పున సుమారు రూ.40 కోట్ల ఖర్చు..
ప్రభుత్వమే భరించేందుకు సిద్ధమవుతోంది. ఇలా చేయడం ద్వారా టోల్ప్లాజా(toll-gates)ల వద్ద ట్రాఫిక్జామ్ల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కల్పించాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. సర్కారు నిర్ణయానికి కేంద్రం అంగీకారం తెలిపితే ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, వరంగల్, విజయవాడవైపు వెళ్లే ప్రయాణికులకు భారీగా ఊరట కలుగుతుంది. ఏటా సంక్రాంతి పండుగ సమయంలో టోల్ప్లాజాల వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడం సర్వసాధారణమైంది… ఈ నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇంకా పూర్తిస్థాయిలో వివరణ రావలసి ఉంది.