హుజూర్‌నగర్‌లో డీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు బియ్యం పంపిణీ..

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ డీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు బియ్యం పంపిణీ
హుజూర్‌నగర్ పట్టణం తిలక్‌నగర్ 14వ వార్డులో డీఎస్ఆర్ ట్రస్ట్ మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యుడు దగ్గుపాటి బాబురావు ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెండు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డీఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ, 14వ వార్డులో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండి నడిపిస్తానని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన సోమరాపు ఎల్లమ్మ, నిర్మల కుటుంబాలకు సహాయంగా బియ్యం పంపిణీ చేసినట్లు చెప్పారు. పేదలు, వెనుకబడిన వర్గాలను ఆదుకోవడంలో డీఎస్ఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని, ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు…ఈ కార్యక్రమంలో నెమోజు భద్రమ్మ, సురభి సైదమ్మ, నెమోజు లక్ష్మాచారి, పెద్దారపు రామకృష్ణ, అలవాల ఉపేందర్, కొలపూడి కళ్యాణ్, మామిడి అశోక్, కొండల్ రమేష్, రాము, దుగ్గి సైదులు, బండి నాగేశ్వరరావు, ఇందిరాల వీరమ్మ, గొర్రె కురవమ్మ, సోమవారపు లక్ష్మి, కేతవరపు వనిత, పప్పుల గోపి, యశోద, నాగరాజు, రమేష్, రామ, ఇందిరాల వెంకన్న, నరసయ్య, ఆర్. గోపి, గోవిందు, రామంజమ్మ తదితరులు పాల్గొన్నారు.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959